ANDHRA PRADESHBREAKING NEWSPOLITICSSTATE NEWS

కర్నూల్ లో హైకోర్టు బెంచ్ కు సన్నాహాలు

కర్నూల్లో హైకోర్టు బెంచ్ కు సన్నాహాలు

కర్నూలు ప్రతినిధి జనవరి 31 యువతరం న్యూస్:

కర్నూల్లో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు సన్నోహాలు చేస్తున్నట్లు తెలుగుదేశం పార్టీ సాంస్కృతిక విభాగం జిల్లా అధ్యక్షులు పి, హనుమంతరావు చౌదరి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఐ.టి విద్యాశాఖ మంత్రినారా లోకేష్ బాబు పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కర్నూలులో హైకోర్టు బెంచ్‌ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బెంచ్‌ ఏర్పాటు కోసం మొదట రాష్ట్ర మంత్రిమండలిలో ఆ తర్వాత శాసనసభలో తీర్మానం చేశారన్నారు. ఈ ప్రతిపాదనపై అభిప్రాయాలను తెలిపేందుకు కాంపిటెంట్‌ అథారిటీ (హైకోర్టు న్యాయమూర్తులు-ఫుల్‌ కోర్ట్‌) ముందు ఈ వ్యవహారాన్ని ఉంచాలని గతేడాది అక్టోబరు 28 నే హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ కు లేఖ రాశారని, దానికి స్పందనగానే ఇప్పుడు 15 మంది న్యాయ మూర్తులకు సరిపడా సౌకర్యాలకు సంబంధించిన పూర్తి వివరాలు అందచేయమని హైకోర్టు రిజిస్ట్రార్‌ అడిగారన్నారు. హైకోర్టు బెంచ్‌ ఏర్పాటు ప్రక్రియ వేగం అందుకొని ఇచ్చిన హామీల అమలులో కూటమి ప్రభుత్వం నిబద్దత పాటించిందని హనుమంతరావు అన్నారు.

YUVATHARAM NEWS

Related Articles

Back to top button
error: Content is protected !!