శరణాలయంలో అన్నదానం

శరణాలయంలో అన్నదానం
మంగళగిరి ప్రతినిధి ఫిబ్రవరి 2 యువతరం న్యూస్:
చినకాకాని షైన్ ఆనంద శరణాలయంలో తాడేపల్లి టీడీపీ రూరల్ మాజీ అధ్యక్షులు కొమ్మారెడ్డి కిరణ్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని పెనుమాకకు చెందిన తెలుగు యువత నాయకులు కొల్లి సురేష్ ఆధ్వర్యంలో బాలబాలికలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కేక్ ను చిన్నారులు, నాయకులు కట్ చేశారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ కొమ్మారెడ్డి కిరణ్ తాడేపల్లి మండలం తో పాటు నియోజకవర్గంలో టీడీపీ అభివృద్ధికి ఎంతో కృషి చేశారన్నారు. మంత్రివర్యులు నారా లోకేష్ స్ఫూర్తితో పేదలకు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించి పలువురి మన్ననలు పొందారున్నారు. ఈ కార్యక్రమంలో తెలుగు రైతు జిల్లా అధ్యక్షులు కళ్ళం రాజశేఖరరెడ్డి, టీడీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు వేమూరు మైనార్ బాబు, టీడీపీ నియోజకవర్గ అధికార ప్రతినిధి నల్లిబోయిన శ్రీనివాసరావు, నాయకులు కళ్ళం గోవిందరెడ్డి, తురకా నరేష్, తెలుగు మహిళా నాయకురాలు అనూష, శరణాలయం నిర్వాహకురాలు శ్రీమతి సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు.