శ్రీ సాయినాథుని వార్షికోత్సవముకు సర్వం సిద్ధం

శ్రీసాయినాధుని వార్షికోత్సవంకు సర్వం సిద్ధం
పాతూరి
మంగళగిరి ప్రతినిధి ఫిబ్రవరి 2 యువతరం న్యూస్:
పెదవడ్లపూడి భగవాన్ శ్రీ సత్య షీరిడి సాయిబాబా మందిరంలో ఈనెల మూడో తేదీన అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగే మందిరం 19 వార్షికోత్సవ మహోత్సవాలకు సర్వం సిద్ధం చేసినట్లు మందిరం చైర్మన్ పాతూరి నాగభూషణం అన్నారు. మహోత్సవాల ఏర్పాట్ల ప్రాంగణంలో ఆదివారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడారు. మందిరంలో ఉదయం కాగడా హారతితో బాబా వారి ప్రత్యేక పూజలు ప్రారంభమవుతాయన్నారు. ఈ సందర్భంగా బాబాను దర్శించుకునేందుకు మంగళగిరి పట్టణ పరిసర ప్రాంతాలతో పాటు హైదరాబాద్, అమెరికా నుండి కూడా ప్రముఖుల హాజరవుతారన్నారు. వివిధ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు, ఉన్నతాధికారులు, బాబాని దర్శించుకోవడానికి వస్తున్నారన్నారు. ఈ సందర్భంగా సుమారు 70000 మందికి భారీ అన్నదాన కార్యక్రమంలో ఏర్పాటు చేశామన్నారు. ఉదయం 8 గంటల నుంచే అన్నదాన కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. కావున భక్తులు అధిక సంఖ్యలో హాజరై బాబా వారిని దర్శించుకుని అన్న ప్రసాదాన్ని స్వీకరించాలని పాతూరి విజ్ఞప్తి చేశారు.