అపూర్వం…… ఆత్మీయ సమ్మేళనం

అపూర్వం… ఆత్మీయ సమ్మేళనం
మంగళగిరి ప్రతినిధి జనవరి 20
యువతరం న్యూస్:
కల్మషం లేని మనసు, దిగులు చింతలేని వయసులో ఆడుతూ… పాడుతూ… విద్యనభ్యసంచి జీవన పోరాటంలో తలోదారిలో వెళ్ళిన నాటి విద్యార్థులు 50 ఏళ్ల తర్వాత చదువుల తల్లి ఒడిలో మరోసారి కలిసి చిన్ననాటి జ్ఞాపకాలు, అల్లర్లు గుర్తు చేసుకుంటూ… ఆత్మీయ సమ్మేళనం, గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ ను ఆనందోత్సవాలతో జరుపుకున్నారు.
పెదవడ్లపూడి డీబీఎన్ గార్డెన్లో ఆదివారం రేవేంద్రపాడు జడ్పీ హైస్కూల్లో 1974- 75 సంవత్సరంలో పదవ తరగతి చదివిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం, గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ ఆనందోత్సవాల మధ్య జరుపుకున్నారు. 117 మంది విద్యార్థులకు గాను 50 మంది పూర్వ విద్యార్థులు సమ్మేళనంకు హాజరయ్యారు. 27 మంది విద్యార్థులు వివిధ కారణాలతో మరణించారు. తొలుత పూర్వ విద్యార్థులు రేవేంద్రపాడులో తాము విద్యనభ్యసంచిన హైస్కూల్ ఆవరణలోని శ్రీ సరస్వతి దేవి అమ్మవారికి పూజలు నిర్వహించారు. తమతో విద్యను అభ్యసించి మరణించిన చిన్ననాటి మిత్రుల ఆత్మశాంతికి రెండు నిమిషాలు మౌనం పాటించారు. ప్రస్తుత హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు హృదయరాజును పూర్వ విద్యార్థుల సన్మానించారు.. హైస్కూల్లో సుమారు లక్ష 75 వేల రూపాయల వ్యయంతో సైకిల్ స్టాండ్ నిర్మాణం చేపడతామని వారు హామీ ఇచ్చారు. అనంతరం పెదవడ్లపూడి డీబీఎన్ గార్డెన్ లో వివిధ ఆటలు, పాటలతో ఒకరికి ఒకరు తమ చిన్ననాటి జ్ఞాపకాలను పంచుకున్నారు. బాల్య మిత్రులుగా కలసి, మెలసి విద్యనభ్యసించి, తిరిగి 50 ఏళ్ల తర్వాత అమ్మమ్మ, తాతయ్యల వయసులో కలుసుకున్నామంటూ వారి, వారి కుటుంబ పరిస్థితులను తెలుసుకుంటూ ఆనందోత్సవాలతో సమ్మేళనం జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు వెలగపూడి బ్రహ్మాజీ, గడ్డిపాటి శంకరరావు, ముసునూరి సత్యనారాయణ, సూరపనేని నాగేశ్వరరావు, సుందరి కుమారి, మన్నవ రమేష్, దొడ్డా శ్రీనివాసరావు, ఓబుల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.