ANDHRA PRADESHOFFICIALSTATE NEWS
మంత్రి నారా లోకేష్ కు వివేకానందుని జీవిత చరిత్ర పుస్తకం అందజేసిన అన్నే

మంత్రి లోకేష్ కు వివేకానందుని జీవిత చరిత్ర పుస్తకం అందజేసిన అన్నే
తాడేపల్లి ప్రతినిధి జనవరి 20 యువతరం న్యూస్:
ఉండవల్లిలో రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ నివాస గృహంలో ఆదివారం మంత్రి లోకేష్ ను పెదవడ్లపూడి మాజీ సర్పంచ్, టీడీపీ శాశ్వత సభ్యులు అన్నే చంద్రశేఖర్, శ్రీమతి పద్మలత దంపతులు మర్యాదపూర్వకంగా కలిశారు. టీడీపీ సభ్యత నమోదు కోటి 52 లక్షలకు చేరుకొని దేశంలో సభ్యత నమోదులో టీడీపీ రికార్డు సాధించడానికి కృషి చేసిన మంత్రి లోకేష్ ను వారు అభినందించారు. ఈ సందర్భంగా లోకేష్ కు అన్నే దంపతులు వివేకానందుని జీవిత చరిత్ర పుస్తకం అందజేశారు. టీడీపీ నాయకులు అన్నే నంద కిషోర్, బోయపాటి రమేష్ తదితరులు పాల్గొన్నారు.