హరిత సాయి ని అభినందించిన మంత్రి నారా లోకేష్

హరిత సాయిని అభినందించిన మంత్రి నారా లోకేష్
తాడేపల్లి ప్రతినిధి జనవరి 20 యువతరం న్యూస్:
స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత ఏడాది సెప్టెంబర్ లో నిర్వహించిన తెలుగు టైప్ రైటింగ్ లోయర్ గ్రేడ్ పరీక్షలో రాష్ట్రస్థాయిలో మొదటి ర్యాంకును సాధించిన మంగళగిరి -తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధి యర్రబాలెం కు చెందిన ఆరాధ్యుల హరిత సాయిని రాష్ట్ర ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ అభినందించారు. ఈ మేరకు ఆదివారం హరిత సాయి నగరానికి చెందిన మాధవి టైప్ ఇన్స్టిట్యూట్ ప్రిన్సిపాల్ పి మురళీ తో కలిసి మంత్రి నారా లోకేష్ ను తాడేపల్లి లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. తెలుగు టైప్ రైటింగ్ లోయర్ గ్రేడ్ పరీక్షలో హరిత సాయి రాష్ట్రస్థాయిలో మొదటి స్థానం సాధించడం అభినందనీయమని మంత్రి లోకేష్ కొనియాడారు. హరిత సాయికి టైప్ రైటింగ్ లో చక్కని శిక్షణ ఇచ్చిన టైప్ ఇన్స్టిట్యూట్ ప్రిన్సిపాల్ పి మురళీని మంత్రి లోకేష్ అభినందించారు.