సంక్రాంతి కొత్త కాంతి

సంక్రాంతి కొత్త కాంతి
(నూతన సాహిత్య ప్రక్రియ చామంతి పువ్వులు)
1…సంక్రాంతి పండుగ/
ఇంటింటా ఆనందాల వెలుగులు/
గుండెలో ఆత్మీయత చిగురించే రోజు/
2. సూర్యునితో పోటీపడే/
భోగిమంట /
చలిలో ఆరోగ్యానికి రక్ష/
3. తెలుగింటి రంగురంగుల/ ముత్యాలముగ్గు/
తెలుగు సంస్కృతికి వెలుగు/
4. కనుమ పండుగ /
పశువులను అందంగా అలంకరించి/ పూజిస్తూ విశ్రాంతి ఇచ్చే సంబరం/
5. కోడి పందాలు /
. తెలుగు పౌరుషానికి ప్రతీకలు/
సాంస్కృతికి దివిటి/
6. సంక్రాంతి ఉదయాన /
మంచు పువ్వుల వాన/
చలికి వీడ్కోలు భోగిమంట వెలుగు/
7. ఇంటి ముందు ముగ్గులు /
. పుడమి తల్లికి మంగళహారతులు/ స్వాగతం శ్రీలక్ష్మికి/
8. కన్నెపిల్లల గోబ్బిసంబరాలు/ కన్నేమనస్సుల్లో కొత్త అందాల/ ఆనందాల నిశ్శబ్దవెలుగులు/
9.
9. గంగిరెద్దుల విన్యాసాలు/ హరిదాసుల కీర్తనలు/
రైతు ఇంట ధాన్యం ప్రవాహం/
10. పల్లె కొత్త పెళ్లికూతురులా/
కొత్త వసంతంతో చిగురుతో మంచుతో/ సింగారించుకుంది/
…. డాక్టర్ నల్లా నరసింహమూర్తి
సీనియర్ తెలుగు లెక్చరర్
శ్రీశ్రీ కళావేదిక జిల్లా అధ్యక్షులు
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఉభయ తెలుగు రాష్ట్రాల తెలుగు అధ్యాపక సంఘం గౌరవ ఉపాధ్యక్షులు