ఫణీంద్ర కుమార్ ను అభినందించిన బిసి రాజారెడ్డి

ఫణీంద్ర కుమార్ ను అభినందించిన బిసి రాజారెడ్డి
రీసైక్లింగ్ ఆర్ట్ లో ఫణీంద్ర కుమార్ ప్రతిభ
రెండో సారి ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డు సాధించిన ఫణీంద్ర కుమార్
ఫణీంద్ర కుమార్ ను సత్కరించి అభినందించిన బిసి రాజారెడ్డి
భవిష్యత్ లో మరెన్నో విజయాలు సాధించాలని ఆకాంక్ష
బదనపల్లె ప్రతినిధి జనవరి 9 యువతరం న్యూస్:
బనగానపల్లె మండలం పసుపుల గ్రామానికి చెందిన ఫణీంద్ర కుమార్ రీసైక్లింగ్ ఆర్ట్ లో కనబరిచిన ప్రతిభ కు రెండో సారి ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డు లో చోటు సంపాదించారు. ఈసందర్బంగా బనగానపల్లె పట్టణ మాజీ సర్పంచ్ బిసి రాజారెడ్డి గురువారం ఫణీంద్రకుమార్ కు శాలువా కప్పి పూలమాలతో ఘనంగా సత్కరించి ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం బిసి రాజారెడ్డి మాట్లాడుతూ ఫణీంద్రకుమార్ రీసైక్లింగ్ లో అద్భుత ప్రతిభ కనబరుస్తుండటం అభినందనీయమన్నారు. ఖాళీ సిగరెట్ ప్యాకెట్లు , ప్లాస్టిక్ బాటిల్స్ , ఫ్యాబ్రిక్స్ తదితర వ్యర్థాలతో 210 ఫీట్ 7 ఇంచుల డీఎన్ఏ మోడల్ చేసి రెండో సారి ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డు సాధించాడన్నారు. ఫణీంద్ర కుమార్ భవిష్యత్ లో మరెన్నో ప్రజోపయోగ పర్యావరణ ప్రయోగాలు చేసి రికార్డులు సాధించాలని ఆకాంక్షించారు. ఇప్పటి వరకు ఫణీంద్రకుమార్ అధికారికంగా నాలుగు రికార్డులు సొంతం చేసుకోవడం గర్వించదగ్గ విషయం అన్నారు. ఇంతకుముందు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు సంపాదించాడన్నారు. అదే విధంగా 2023 డిసెంబర్ 29న పంజాబ్ అమృతసర్ లోని గురునానక్ ఆడిటోరియం లో జరిగిన ఇంటర్నేషనల్ అవార్డు షో లో అవార్డు అందుకున్నాడని తెలిపారు. ఫణీంద్ర రీసైకిల్ ఆర్టిస్ట్ & రైటర్ గా రాణిస్తూ ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. ఫణీంద్ర చాలా సిన్సియర్ గా రీసైక్లింగ్ గురించి సమాజంలో అవగాహన పెంచడానికి ప్రయత్నం చేస్తున్నాడని అందరూ అతన్ని ప్రోత్సహించాలన్నారు. కార్యక్రమంలో కోటా శివశంకర్ , భాస్కర్ , విష్ణువర్ధన్ రెడ్డి , మణికంఠ పాల్గొన్నారు.