పోలీస్ సేవలపై ప్రజల అభిప్రాయం

పోలీస్ సేవలపై ప్రజల అభిప్రాయం
ప్రజల అభిప్రాయానికి పోలీసులు విలువ ఇస్తాం
ఏటూరు నాగారం ఏ ఎస్ పి
ములుగు ప్రతినిధి జనవరి 9 యువతరం న్యూస్:
తెలంగాణ పోలీస్ సేవలపై ప్రజల అభిప్రాయం, పోలీసులు ప్రజల అభిప్రాయాన్ని విలువ ఇవ్వడం జరుగుతుంది,అనే పోస్టర్ ను ఏటూరు నాగారం సబ్ డివిజన్ కేంద్రంలో గురువారం రోజున ఏటూరు నాగారం ఏఎస్పి శివం ఉపాధ్యాయ ఆవిష్కరించారు,డీజీపీ ఆదేశాల మేరకు ములుగు జిల్లా ఎస్పీ శబరిష్, ఏటూరు నాగారం ఏఎస్పీ శివం ఉపాధ్యాయ సూచనల మేరకు గురువారం రోజున ఏటూరు నాగారం సీఐ, ఎస్సై ఆధ్వర్యంలో ఏటూరు నాగారం ఏఎస్పి శివం ఉపాధ్యాయ మొట్ట మొదటిసారిగా తెలంగాణ పోలీస్, సేవలపై ప్రజల అభిప్రాయం, సేకరణ పోస్టర్ ను ఏఎస్పీ ఆవిష్కరించారు,తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పోలీసులు అందిస్తున్న సేవలుపై ప్రజల్లో నేలకొన్న అభిప్రాయాలు తెలియజేయడం కోసం క్యూఆర్ కోడ్ ను ప్రజలకు అందుబాటులో తీసుకోవడం జరిగిందన్నారు, తమ తమ అభిప్రాయాలను,క్యూఆర్ కోడ్ ద్వారా తెలియజేయాలని సూచించారు,ప్రజా సమస్యలే పరిష్కారం ద్వేయంగా పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేస్తుందన్నారు ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులు ఏటూరు నాగారం సిఐ . అనుముల శ్రీనివాస్, ఏటూరు నాగారం ఎస్ఐ తాజుద్దీన్, వాజేడు మండలం పేరూరు ఎస్సై ఎస్ఐ గుర్రం,కృష్ణ ప్రసాద్, వెంకటాపురం సిఐ బండారి కుమార్, వాజేడు ఎస్సై ఎన్,రాజకుమార్ వెంకటాపురం ఎస్ఐ కొప్పుల తిరుపతిరావు తదితర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.