టిప్పర్ ఢీకొని 13 గొర్రెలు మృతి, తీవ్రంగా గాయపడిన గొర్రెల కాపరి

టిప్పర్ ఢీ కొని 13 గొర్రెలు మృతి. తీవ్రంగా గాయపడ్డ గొర్రెల కాపరి..ప్రమాదంపై మంత్రి అచ్చెన్నాయుడు విచారం
గొర్రెల కాపరి ఓబులపతికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించిన మంత్రి అచ్చెన్నాయుడు
బాధిత కుటుంబానికి నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ అమలుకు పరిశీలించాలని ఆదేశం
అనంతపురం ప్రతినిధి జనవరి 11 యువతరం న్యూస్:
సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గం పరిధిలోని బత్తలపల్లి మండలం కోడేకండ్ల వద్ద గురువారం తెల్లవారు జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో గొర్రెల కాపరి ఓబులపతి తీవ్ర గాయాలవడమే కాక 13 గొర్రెలు మృతి చెందడం పట్ల రాష్ట్ర వ్యవసాయ, పశుసంవర్ధక శాఖామంత్రి అచ్చెన్నాయుడు విచారం వ్యక్తం చేశారు. ప్రమాద ఘటన గురించి మంత్రి అచ్చెన్నాయుడు జిల్లా పశుసంవర్ధక అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ప్రమాదంలో తీవ్ర గాయాలైన
గొర్రెల కాపరి ఓబులపతికి మెరుగైన వైద్యం అందించాలని సంబంధిత అధికారులను మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించారు.
గొర్రెల కాపరి ఓబులపతి నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ ద్వారా గొర్రెల కొనుగోలుకు రాయితీపై రుణం అందించేందుకు అవకాశాలు పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.