వైభవంగా శివ ముక్కోటి

వైభవంగా శివ ముక్కోటి
మంగళగిరి ప్రతినిధి జనవరి 14 యువతరం న్యూస్:
మంగళగిరి శ్రీ గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వరస్వామి వారి దేవస్థానంలో శివ ముక్కోటి పర్వదినాన్ని పురస్కరించుకొని సోమవారం స్వామివారి ఉత్తర ద్వార దర్శన మహోత్సవం వైభవంగా జరిగింది. స్వామివారు తెల్లవారుజాము నుండే ఉత్తర ద్వారంలో బృంగి వాహనంపై శ్రీ గంగా భ్రమరాంబ సమేతుడైన మల్లేశ్వరుడు భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకొని టెంకాయలు కొట్టి, కర్పూర నీరాజనాలు సమర్పించి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాలయంలో స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, అమ్మవారికి కుంకుమార్చనలు నిర్వహించారు. దేవస్థాన ప్రధాన అర్చకులు టి మహేష్ కుమార్ శర్మ పూజలు నిర్వహించారు. ఉత్సవానికి స్వర్గీయ బచ్చు వెంకట ఉల్లక్కి ,మాణిక్యమ్మ జ్ఞాపకార్థం మాజేటి లక్ష్మీనరసింహమూర్తి, శ్రీమతి లలిత దంపతులుగా కైంకర్యపరులుగా వ్యవహరించారు. అనంతరం స్వామివారి గ్రామోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో దేవస్థానం మాజీ ట్రస్ట్ బోర్డు చైర్మన్ బోగి కోటేశ్వరరావు, డాక్టర్ వంశీకృష్ణ మాజేటి, శ్రీమతి దీప దంపతులు, మాజీ ట్రస్ట్ బోర్డ్ సభ్యులు కొల్లి వెంకట బాబురావు, అద్దంకి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. దేవస్థానం కార్యనిర్వాహణాధికారి జేవీ నారాయణ పర్యవేక్షించారు.