నేడు ఫక్రుద్దీన్ బాబా గంధం మహోత్సవం

నేడు ఫక్రుద్దీన్ బాబా గంధం మహోత్సవం
నెల్లూరు, ఆత్మకూరు, ఏఎస్ పేట, డిసెంబర్ 20 యువతరం న్యూస్:
ఏఎస్ పేట మండల కేంద్రంలో వెలసి ఉన్న ప్రముఖ పురాతన దర్గా శ్రీ హజ్రత్ సయ్యద్ ఫక్రుద్దీన్ షావలి ఉరఫ్ ఫక్రుద్దీన్ బాబా స్వాముల వారి గంధం మహోత్సవం నేడు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు దర్గా సజ్జాద నషీన్ సయ్యద్ ఆరిఫ్ హుస్సేన్ నేడు ఒక ప్రకటనలో తెలిపారు. గంధమహోత్సవం శుక్రవారం రాత్రికి మేళ తాళాలతో భక్తి కీర్తనలతో భక్తజన సందోహం నడుమ ఊరేగింపుగా బయలుదేరి హజ్రత్ వారి దర్గాకు చేర్చబడుతుందని అక్కడ గంధ లేపనం అనంతరం గంధం ప్రసాదాలు భక్తులకు పంచబడతాయన్నారు. శనివారం ఉరుసు ఆదివారం తహలీల్ ఫాతిహాలు నిర్వహించనున్నట్లు హరి హుస్సేన్ తెలిపారు. పై కార్యక్రమాలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారి ఆశీస్సులు పొందాలన్నారు. భక్తుల సౌకర్యార్థం అన్నదానం షామియానాలు త్రాగునీరు తదితర ఏర్పాట్లు చేయనున్నట్లు ఆయన తెలిపారు.