కూటమి ప్రభుత్వానికే ప్రజా మద్దతు తెదేపాలో భారీ చేరికలు

కూటమి ప్రభుత్వానికే ప్రజామద్దతు. తెదేపాలో భారీ చేరికలు
ఏపీ ప్రభుత్వ విప్, శాసనసభ్యులు శ్రీమతి తంగిరాల సౌమ్య గారు
గడచిన ఐదు ఏళ్ళు రాక్షస పాలన, నేడు రాష్ట్రంలో చంద్రన్న చల్లని రామపాలన కొనసాగుతుంది.
ఎన్టీఆర్ జిల్లా/కంచికచర్ల డిసెంబర్ 20 యువతరం న్యూస్:
నందిగామ టౌన్ : నందిగామ పట్టణం కాకాని నగర్ ఏపీ ప్రభుత్వ విప్, శాసనసభ్యులు శ్రీమతి తంగిరాల సౌమ్య గారి కార్యాలయం నందు గురువారం నాడు కంచికచర్ల మండలం కీసర గ్రామము నుంచి పరిటాల రాము ఏడీఐడీసీ డైరెక్టర్, గ్రామ సర్పంచ్ పేరం నరసమ్మ పరిటాల దివ్య గ్రామ మాజీ సర్పంచ్, సంగీత భాస్కరరావు గ్రామ మాజీ సర్పంచ్, జవ్వాజి సైదేశ్వరరావు, ఆకుల శ్రీనివాసరావు, చలామలా స్వామి, తక్కెడ వెంకటేశ్వరరావు గార్లు వారి అనుచరులు 360 కుటంబాలతో కలిసి తెలుగుదేశం పార్టీలోకి రావడం జరిగినది. వీరిని కూటమినేతలతో కలిసి ఏపీ ప్రభుత్వ విప్,శాసనసభ్యులు శ్రీమతి తంగిరాల సౌమ్య గారు వారిని పార్టీ కండువా కప్పి తెలుగుదేశం పార్టీలోకి సాదరంగా ఆహ్వానించడం జరిగినది. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజాప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఈ రోజు పార్టీలోకి విచ్చేసిన ప్రతిఒక్కరిని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాము గడచినా ఐదేళ్ళ రాక్షస పాలన నుంచి ఆంధ్రరాష్ట్ర ప్రజలు కూటమి ప్రభుత్వ ఏర్పాటుతో స్వేచ్ఛ ఊపిరిని పొందారు. సంక్షేమం పేరిట అప్పులు తెచ్చి పప్పుబెల్లాలుగా పంచి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేసిన సంగతి అందరికి తెలుసు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్డీయే కూటమికి 164 సీట్లను రాష్ట్ర ప్రజానీకం అతిభారీ మెజారిటీతో ఇచ్చి గెలిపించారు. సూపర్ సిక్స్ లో భాగంగా పెన్షన్ పెంపుదల,ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత గ్యాస్ సిలండర్ల పంపిణి చేసుకొంటూ పోతున్నాము. గత పాలకుల నిర్లక్ష్యంతో రహదారులు అధ్వాన పరిస్థితికి చేరితే ఈ కూటమి ప్రభుత్వంలో వాటిని అభివృద్ధిపరుస్తూ ముందుకు పోతున్నాము. ఆయకట్టు చివరి ఎకరా వరకు నీరు అందించే దిశగా పని చేస్తున్న రైతు పక్షపాతి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం ఇంతటి అభివుద్ది, సంక్షేమంతో ఆకర్షితులవుతున్న ప్రజలు స్వచ్చందంగా ముందుకు వచ్చి పార్టీలోకి రావడం నిజంగా హర్షణీయం ఈ రోజు పార్టీలోకి విచ్చేసిన ప్రతి ఒక్కరిని పేరు పేరునా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను.