ANDHRA PRADESHBREAKING NEWSOFFICIALSTATE NEWS
ఏపీలో అంగన్వాడీలకు రూ.52.68 కోట్లు

ఏపీలో అంగన్వాడీలకి రూ.52.68 కోట్లు
అమరావతి ప్రతినిధి డిసెంబర్ 20 యువతరం న్యూస్:
ఏపీ రాష్ట్రంలో అంగన్వాడీ కేంద్రాల్లో మరుగుదొడ్ల నిర్మాణం, తాగునీటి సదుపాయాలకు రూ.52.68 కోట్లు విడుదల చేసినట్లు మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పేర్కొన్నారు.
స్త్రీ, శిశు సంక్షేమశాఖపై బుధవారం ఆమె సమీక్షించారు.
“అంగన్వాడీ పిల్లలు సాధించిన పురోగతిపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించడానికి ప్రతినెల 5వ తేదీన ఈసీసీఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నాం ప్రత్యేక డ్రైవ్ల ద్వారా 371మంది పిల్లల్ని కార్మికవృత్తి నుంచి విముక్తి కల్పించాం”అని తెలిపారు.