విద్యుత్ లైన్ తెగిపడి తండ్రి కుమారుడు మృతి

విద్యుత్ లైన్ తెగిపడి తండ్రి కొడుకు మృతి.
అనంతపురం ప్రతినిధి నవంబర్ 20 యువతరం న్యూస్:
విద్యుత్ లైన్ తెగిపడి తండ్రి కొడుకు మృత్యువాత పడిన విషాద సంఘటన జిల్లాలోని పుట్లూరు మండలంలో బుధవారం చోటు చేసుకుంది. మండలంలోని మడుగుపల్లి గ్రామానికి చెందిన పూజారి రామాంజనేయులు, తన కుమారుడి తో కలసి ఉదయమే ద్విచక్ర వాహనంపై తన బంధువులను చూడడం కోసం వై ఎస్ ఆర్ కడప జిల్లా లింగాల మండలం అంకెవారిపల్లికి వెళ్లి తిరిగి వస్తుండగా మార్గమధ్యంలోని యల్లనూరు మండలం దంతలపల్లి గ్రామ సమీపంలోo ఆకస్మాత్తుగా విద్యుత్ లైన్ తెగి వారిపై పడింది. దీనితో వారు అక్కడికక్కడే మృతి చెందారు.ఈ సంఘటనతో ఇటు మడుగుపల్లి, అటు అంకెవారిపల్లిలో విషాద ఛాయలు నెలకొన్నాయి. కుటుంబీకులు, బంధుమిత్రుల ఆర్థనాధాలు, విలపిస్తున్న దృశ్యాలు అందరి హృదయాలు కలచివేసాయి. పోలీసులు సంఘటనా స్థలాన్ని సందర్శించి శవాలను పోస్టుమార్టం నిమిత్తం తాడిపత్రి ప్రభుత్వ అస్పత్రికి తరలించారు.