జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టులు, పరిశ్రమల భూసేకరణ పూర్తి చేయండి

జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టులు, పరిశ్రమల భూసేకరణ పూర్తిచేయండి
జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా
నంద్యాల కలెక్టరేట్ నవంబర్ 20 యువతరం న్యూస్:
జిల్లాలో జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టులు, పరిశ్రమలు భూసేకరణకు సంబంధించి ప్రతిపాదనలు త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి రెవెన్యూ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ ఛాంబర్ లో పెండింగ్ లో ఉన్న భూసేకరణపై జాయింట్ కలెక్టర్ సి విష్ణు చరణ్ తో కలిసి రెవెన్యూ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మాట్లాడుతూ 340 సి ప్యాకేజీ 4 కింద నందికొట్కూరు, జూపాడుబంగ్లా, పాములపాడు, ఆత్మకూరు మండలాలు మీదుగా వెళ్లే రహదారి భూసేకరణకు సంబంధించి 39 ఎకరాలకు సంబంధించిన క్లెయిమ్స్ సంబంధిత మండల తాసిల్దారుల నుండి క్లెయిమ్స్ తెప్పించుకొని నిశితంగా పరిశీలించి ప్రతిపాదనలు పంపవాలని ఆర్డిఓలను ఆదేశించారు. అలాగే 1.98 కి.మీ సంబంధించిన అడ్డంకులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకొని సంబంధిత వ్యక్తులను సంప్రదించి త్వరితగతిన పూర్తి చేయాలని ఆర్డీఓలు, తాసిల్దారులను ఆదేశించారు.
167 కె ఒకటవ ప్యాకేజీ క్రింద (నంద్యాల నుండి జమ్మలమడుగు వరకు) నంద్యాల, గోస్పాడు, దొర్నిపాడు, కోవెలకుంట్ల, ఉయ్యాలవాడ, సంజామల మండలాల మీదుగా వెళ్లే రహదారి సంబంధించిన క్లెయిమ్స్ అవార్డ్స్ పాసయ్యాయని త్వరితగతిన సంబంధిత క్లెయిమ్స్ తెప్పించుకొని భూమిరాశి పోర్టల్ లో అప్లోడ్ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. 167 కె ప్యాకేజ్ 4 కింద కొత్తపల్లె, ఆత్మకూరు, ఆత్మకూర్ వెలుగోడు, బండి ఆత్మకూరు, నంద్యాల మండలాల్లో పెండింగ్లో ఉన్న క్లెయిమ్స్ కూడ పాసయ్యాయని త్వరితగతిన సంబంధిత క్లెయిమ్స్ ను భూమిరాశి పోర్టల్ లో అప్లోడ్ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. 340బి కింద బేతంచెర్ల, డోన్ మండలాల్లో 2.18 కి.మీ ల పరిధిలో పెండింగ్లో ఉన్న క్లెయిమ్స్ ను సంబంధిత తాసిల్దారుల నుండి నివేదికలు తెప్పించుకొని పూర్తిచేయాలని డోన్ ఆర్డీఓను కలెక్టర్ ఆదేశించారు.
గుంటూరు – గుంతకల్ డబల్ రైల్వే లైనింగ్ పనులకు సంబంధించిన భూసేకరణను వెంటనే పూర్తి చేసి పంపాలని డోన్, నంద్యాల ఆర్డీవో లను కలెక్టర్ ఆదేశించారు. జాతీయ రహదారుల భూసేకరణపై రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతివారం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి వివరాలు తెలుసుకుంటున్నారని… ఇందుకు సంబంధించి భూసేకరణలో ఎలాంటి జాప్యం చేయకుండా వార వారం ప్రగతి కనపరిచేలా చర్యలు తీసుకోవాలని రెవిన్యూ అధికారులను కలెక్టర్ ఆదేశించారు.