ANDHRA PRADESHDEVOTIONALOFFICIALWORLD

అయ్యప్ప స్వామి భక్తుల పాలిట ఆపద్బాంధవుడు నారా లోకేష్

అయ్యప్ప భక్తుల పాలిట ఆపద్బాంధవుడు నారా లోకేష్

కేరళ పోలీస్ అధికారులతో మాట్లాడిన మంత్రి నారా లోకేష్ టీం

విడిచి పెట్టిన పోలీసులు భోజనాలు పెట్టి పంపారు

మంత్రి నారా లోకేష్, ఏపీ ప్రభుత్వం, మీడియా ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపిన అయ్యప్ప భక్తులు

మంగళగిరి ప్రతినిధి నవంబర్ 20 యువతరం న్యూస్:

వారి రాష్ట్రము కాదు.. అక్కడి భాష తెలీదు.. వారికి ఉన్నదల్లా అయ్యప్ప స్వామి పట్ల భక్తి. అయ్యప్ప సన్నిధికి వెళ్తున్న వారి వాహనం ప్రమాదానికి గురైంది. దర్శనం మాట దేవుడెరుగు.. మొత్తం అయ్యప్ప భక్తులంతా కేరళ రాష్ట్రంలోని ఓ పోలీస్ స్టేషన్లో తిండి తిప్పలు లేకుండా పడిగాపులు కాశారు. ఈ సమాచారం ఏపీ ప్రభుత్వానికి, ముఖ్యంగా మంత్రి నారా లోకేష్ కి చేరితే చాలు.. తమకు సహాయం అందుతుందని వారంతా భావించారు. తమ ప్రాంతానికి చెందిన మీడియా ప్రతినిధుల ద్వారా నారా లోకేష్‌కి సమాచారం చేరి, తన టీంతో కేరళ అధికారులతో మంత్రి మాట్లాడించారు. పోలీస్ స్టేషన్ నుంచి ఎటువంటి కేసు లేకుండా అయ్యప్ప భక్తులను విడిచిపెట్టడంతోపాటు, అప్పటివరకు ఆకలితో ఉన్న అందరికీ భోజనాలు కూడా ఏర్పాటు చేశారు పోలీసులు. తమను ఆపదలో ఆదుకున్న ఆపద్బాంధవుడు నారా లోకేష్ అని గంగాధర నెల్లూరు నియోజకవర్గం గొడుగు చింత గ్రామవాసులు ప్రశంసించారు. ఇబ్బందుల్లో ఉన్న తమకు సహాయం అందించిన ఏపీ ప్రభుత్వం, మంత్రి నారా లోకేష్, గంగాధర నెల్లూరు నియోజకవర్గ ఎమ్మెల్యే థామస్, తిరుపతి పార్లమెంటు టిడిపి సమన్వయకర్త భీమినేని చిట్టిబాబు నాయుడు, మీడియా ప్రతినిధులకు వారు కృతజ్ఞతలు తెలియజేశారు.

Yuvatharam News

Related Articles

Back to top button
error: Content is protected !!