ANDHRA PRADESHOFFICIAL
కేంద్ర టెలికాం సలహా కమిటీ సభ్యుల నియామకం

కేంద్ర టెలికాం సలహా కమిటీ సభ్యుల నియామకం
నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరికి ధన్యవాదములు తెలిపిన నూతన సభ్యులు
పాములపాడు సెప్టెంబర్ 14 యువత న్యూస్ :
నంద్యాల పార్లమెంట్ పరిధిలోని కేంద్ర ప్రభుత్వ టెలికమ్యూనికేషన్ మంత్రిత్వ శాఖ అయిన బి ఎస్ ఎన్ ఎల్ ( టెలికామ్) సలహా కమిటీ సభ్యులుగా పాములపాడు కురువ రమేష్, పాణ్యం చిట్టిబోయిన శ్రీనివాస యాదవ్, కల్లూరు మధు, ఆత్మకూరు గౌస్ లాజం, నూనెపల్లె పెరుమాళ్ళ విజయకుమార్ లను నియమించారు. బి ఎస్ ఎన్ ఎల్ ( టెలికామ్ సంస్థ) కు ఐదు మంది సభ్యులను కేంద్ర ప్రభుత్వ టెలి కమ్యూనికేషన్ మంత్రిత్వ శాఖ ద్వారా నియమించేందుకు సహకరించిన నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ బైరెడ్డి శబరి కి నూతనంగా నియమించిన టెలికామ్ సభ్యులు ధన్యవాదములు తెలిపారు.