ANDHRA PRADESHOFFICIAL

సోమవారం 16వ తేదీ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం రద్దు

16 వ తేదీ సోమవారం నిర్వహించే “ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టం)కార్యక్రమం…”రద్దు

జిల్లా ఎస్పీ  జి. బిందు మాధవ్ ఐపియస్

కర్నూలు సెప్టెంబర్ 15 యువతరం న్యూస్:

సోమవారం16 వ తేదీన మీలాద్ ఉన్ నబీ (ప్రభుత్వ సెలవు దినం) పండుగ అయినందున” ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టం)కార్యక్రమం ను ” రద్దు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ  జి. బిందు మాధవ్ ఐపియస్  శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.

కావున అర్జీదారులు సుదూర ప్రాంతాల నుండి వ్యయ , ప్రయాసలతో కర్నూల్, కొత్తపేట , కర్నూలు టు టౌన్ పోలీసు స్టేషన్ ప్రక్కన ఉన్న ఎస్పీ  క్యాంపు కార్యాలయంలో జరగబోయే జిల్లా ఎస్పీ గారి “ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ” కార్యక్రమానికి రావొద్దని తెలిపారు.

జిల్లా ప్రజలు ( ఫిర్యాదుదారులు) ఈ విషయాన్ని గమనించగలరని జిల్లా ఎస్పీ  విజ్ఞప్తి చేశారు.

Yuvatharam News

Related Articles

Back to top button
error: Content is protected !!