మహమ్మద్ ప్రవక్త జన్మదిన వేడుకలు

మహమ్మద్ ప్రవక్త జన్మదిన సందర్భంగా వెల్దుర్తిలో ముస్లింల భారి ర్యాలీ
వెల్దుర్తి సెప్టెంబర్ 17 యువతరం న్యూస్:
జగత్ ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి జన్మదినం సందర్భంగా మండల కేంద్రమైన వెల్దుర్తి లో ముస్లింలు నారే తక్బీర్ , అల్లాహ్ అక్బర్ అనే నినాదంతో వెల్దుర్తి జామియా మసీదు నుండి వెల్దుర్తి పాతబస్టాండ్ మీదుగా పురవీధుల గుండా ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా ముస్లిం పెద్దలు మాట్లాడుతూ సకల మానవాళి మహమ్మద్ ప్రవక్తను ఆదర్శంగా తీసుకొని సత్ప్రవర్తనను, నీతి, నిజాయితీలను కలిగి సంఘ వ్యతిరేక చర్యలైన మద్యపానము జూదము లాంటి వ్యతిరేక చర్యలకు దూరంగా ఉండి దైవభక్తితో సత్ప్రవర్తన కలిగి జీవితాన్ని సన్మార్గంలో జీవించాలని ప్రవక్త యొక్క ఆచరణలను కొనసాగించి సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తూ జీవనాన్ని కొనసాగించాలని సందేశం ఇచ్చారు.
అనంతరము ముస్లిం యువకులు బస్టాండ్ లో మిఠాయిలు పంచిపెట్టారు. ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు మిఠాయిలు ,పండ్లను పంచిపెట్టారు.
ఈ కార్యక్రమంలో ముస్లిం పెద్దలు మరియు యువకులు పాల్గొన్నారు.