ప్రభుత్వ ఉద్యోగికి తెల్ల రేషన్ కార్డు

ప్రభుత్వ ఉద్యోగికి తెల్ల రేషన్ కార్డ్
వెల్దుర్తి సెప్టెంబర్ 17 యువతరం న్యూస్:
వెల్దుర్తి మండలంలోని ఎస్ బోయినపల్లి గ్రామంలో ఒక ప్రభుత్వ ఉద్యోగికి తెల్ల రేషన్ కార్డు ఉండడం గమనించదగ్గ విషయం. ముఖ్యంగా పేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందడం కోసం ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డులను అమలు లోనికి తీసుకురావడం జరిగింది. కానీ కొందరు అక్రమార్కులు దీనిని ఆసరాగా తీసుకొని ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ తెల్ల రేషన్ కార్డులో ప్రభుత్వ సంక్షేమ పథకాలు తీసుకోవడం విశేషం. గ్రామానికి చెందిన రోషన్న అనే వ్యక్తి డబ్ల్యూ ఏపీ 32902900354 అనే నంబర్ తెల్ల రేషన్ కార్డులో పేరు నమోదు అయి ఉన్నాడు. ఇతను దాదాపుగా 18 సంవత్సరాల నుండి కేడీసీసీబీ లో విధులు నిర్వహిస్తున్నాడు. ప్రస్తుతం ఇతను కేడీసీసీబీలో అసిస్టెంట్ మేనేజర్ గా రాచర్లలో విధులు నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా ఇదే రేషన్ కార్డులో పేరు నమోదు అయిన చిన్న సుబ్బన్న పింఛన్ ఐడి నెంబర్ 113680716 ద్వారా ప్రతినెల వృద్ధాప్య పింఛన్ తీసుకోవడం జరుగుతోంది. ఒక రేషన్ కార్డులో ప్రభుత్వ ఉద్యోగి ఉంటే ఆ కార్డు సంబంధించి ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రభుత్వం నిలుపుదల చేయవలసి ఉంది. కానీ దాదాపుగా 18 సంవత్సరముల నుండి ప్రభుత్వాన్ని మోసం చేస్తూ ప్రభుత్వ సంక్షేమ ఫలాలను వారు తీసుకోవడం గమనించదగ్గ విషయం. ప్రతినెల రేషన్ కార్డు మీద వచ్చే సరుకులను గత 18 సంవత్సరములుగా వీరు తీసుకొని అనుభవిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగంలో ఉంటూ ప్రభుత్వ సంక్షేమ పలాలు ఎలా అనుభవిస్తారన్నది ప్రశ్న. అయినా సంబంధిత అధికారులు నేటి వరకు ఈ సంఘటనను గుర్తించకపోవడం విశేషం. నేటికైనా సంబంధిత అధికారులు కల్పించుకుని ప్రభుత్వ ఉద్యోగికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు నిలుపుదల చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. అంతేకాకుండా గ్రామంలో సంబంధిత అంశంపై జిల్లా స్థాయి అధికారుల విచారణ చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది.