ANDHRA PRADESHSOCIAL SERVICE
పాములపాడు వాల్మీకి సంఘం మండల అధ్యక్షుడిగా కొండ దర్గయ్య

వాల్మీకి సంఘం పాములపాడు మండల అధ్యక్షుడిగా కొండా దర్గయ్య నియామకం
పాములపాడు సెప్టెంబరు 18 యువతరం న్యూస్:
పాములపాడు మండలంలోని, జూటూరు గ్రామానికి చెందిన కొండ.దర్గయ్య ను వాల్మీకి సంఘం పాములపాడు మండల అధ్యక్షుడిగా నియమించినట్లు వాల్మీకి సంఘం రాష్ట్ర నాయకులు విక్రం నాయుడు, క్రాంతి నాయుడు, జక్కుల శ్రీనివాస నాయుడు తదితర రాష్ట్ర నాయకులందరూ తెలిపారు. ఈ సందర్భంగా కే.దర్గయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో వాల్మీకులు అన్ని విధాలుగా వెనుకబడి ఉన్నారని వాల్మీకుల అభివృద్ధికి, తన వంతు కృషి చేస్తానని అన్నారు.వాల్మీకి మండలాధ్యక్షుడుగా నన్ను ఎంపిక చేసిన వాల్మీకి సంఘం పెద్దలందరికీ అభినందనలు తెలిపారు.