అధిక వర్షాల వల్ల పంట నష్టం జరిగిన రైతులను ఆదుకోవాలి

అధిక వర్షాల వల్ల పంట నష్టం జరిగిన రైతులను ఆదుకోవాలి
కొత్తపల్లి సెప్టెంబర్ 13 యువతరం న్యూస్:
అధిక వర్షాల వల్ల పంట నష్టం జరిగిన రైతులను ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి ఎన్ స్వాములు ఏపీ రైతు సంఘం జిల్లా నాయకులు జి దాసు డిమాండ్ చేశారు. వారు గురువారం శివపురం గ్రామ సచివాలయం నందు గ్రామ పంచాయతీ కార్యదర్శి సర్పంచ్ చంద్రశేఖర్ యాదవ్ కు వినతి పత్రం అందించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత రెండు మూడు సంవత్సరాలుగా అతివృష్టి అనావృష్టి వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు ఈ సంవత్సరం కూడా వేల రూపాయలు పెట్టుబడులు పెట్టి సాగు చేసిన పంటలు ఆగస్టు సెప్టెంబర్ నెలలలో కురిసిన అధిక వర్షాలకు పంటలన్నీ దెబ్బతిన్నాయి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలోకి వస్తే అన్నదాత సుఖీభవ పెట్టుబడి సాయం రు. 20వేలు ఇస్తామన్నారు వ్యవసాయ సీజన్ ప్రారంభమై మూడు నెలలు అవుతున్న ఎలాంటి సహాయం అందించలేదు ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే నష్టపోయిన పంటలకు ఎకరాకు రు.30 వేల రూపాయలు పరిహారం ఇవ్వాలని అన్నదాత సుఖీభవ పెట్టుబడి సాయం వెంటనే అందించాలని రెండు లక్షల వరకు రైతుల రుణాలను రద్దు చేయాలని వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టే జీవో నెంబర్ 22ను రద్దుచేసి ఉచిత కరెంటు ఇవ్వాలని భూ యజమాని సంతకంతో నిమిత్తం లేకుండా కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని అన్ని రకాల ఎరువులు పురుగుల మందులు రైతు సేవా కేంద్రాల ద్వారా సహకార సంఘాల ద్వారా రైతులకు సబ్సిడీతో అందించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో నాగన్న, స్వామినాథం, స్వాములు, ఇమ్మానుయేలు, పాపన్న, నారాయణ పాల్గొన్నారు.