ANDHRA PRADESHEDUCATIONOFFICIAL

చిన్న మల్కాపురంలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు

చిన్న మల్కాపురంలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు

డోన్ ప్రతినిధి సెప్టెంబర్ 06 యువతరం న్యూస్:

డోన్ మండలంలోని చిన్న మల్కాపురం ఉన్నత
పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాఠశాల యాజమాన్య కమిటి చైర్మెన్ జి. సుబ్రహ్మణ్యం మరియు పాఠశాల పూర్వ విద్యార్థి డా. హనీఫ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. పాఠశాల విద్యార్థులు తమ గురువులను పూలమాల, శాలువా జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు సత్యనారాయణ విద్యార్థులకు విద్య యొక్క ప్రాముఖ్యతను గురువు యొక్క గొప్పతనాన్ని
వివరించారు. పాఠశాల ఉపాధ్యాయులు శ్రీనివాసరెడ్డి, చంద్రశేఖరరెడ్డి, నాగమణి, వేణుగోపాల్, నందప్ప, జానకి రాముడు, ముంతాజ్ బేగం, షరీఫా, గంగాధర్ రావు, నూర్ అహ్మద్ బాషా, పరమేష్, శ్రీనివాస రాజు, అరుణాదేవి, పర్వీన్ సుల్తానా, చౌడమ్మ, తదితరులు విద్యార్థులకు తమ అమూల్యమైన
సందేశాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పాఠశాల పూర్వ విద్యార్థి డా. హనీఫ్ తమ వ్యాయామ ఉపాధ్యాయులు పక్కీర్ రాజు జ్ఞాపకార్థం పాఠశాలకు ఒక కంప్యూటర్ సిస్టం ను బహుకరించారు. విద్యార్థులు జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా ఎదుర్కోని బాగా చదివి ఉన్నతస్థాయికి చేరాలని సందేశాన్ని
అందించారు. తమ పాఠశాలకు విలువైన కంప్యూటర్ ను బహుకరించిన పూర్వ విద్యార్థి డా : హనీఫ్ గారిని పాఠశాల ఉపాధ్యాయ బృందం ఘనంగా సన్మానించారు. విద్యార్థులు
పాటలు మరియు చక్కని సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు.

Yuvatharam News

Related Articles

Back to top button
error: Content is protected !!