ANDHRA PRADESHEDUCATIONOFFICIALSTATE NEWS
నేడు కూడా విద్యాసంస్థలకు సెలవు

నేడు కూడా విద్యాసంస్థలకు సెలవు
గుంటూరు కలెక్టర్
గుంటూరు ప్రతినిధి సెప్టెంబర్ 2 యువతరం న్యూస్:
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో కొన్ని చోట్ల వర్షాలు తగ్గుముఖం పట్టాయి. మరికొన్ని చోట్ల ముంపు ప్రాంతాలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి. ఈ క్రమంలో ఈ నెల 3వ తేదీన మంగళవారం కూడా పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, అంగన్వాడీ సెంటర్లకు సెలవులు ఇవ్వాలని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మీ జిల్లా ప్రభుత్వ యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేశారు.