మచ్చలేని చంద్రునిపై….. సైకో జగన్

మచ్చలేని చంద్రునిపై.. సైకో జగన్
అక్రమ కేసుతో అక్రమంగా అరెస్ట్
యావత్ తెలుగుజాతి మర్చిపోలేని రోజు
అభివృద్ధి లక్ష్యంగా కూటమి పాలన
నంద్యాల ప్రతినిధి సెప్టెంబర్ 10 యువతరం న్యూస్:
రెండు తెలుగు రాష్ట్రాలలో మచ్చలేని చంద్రుని లాగా.. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాలుగు శతాబ్దాల పాటు రాజకీయ అనుభవం గల నాయకుని పై అక్రమంగా గత సంవత్సరం సెప్టెంబర్ 9వ తేదీ నాడు అక్రమ కేసు నమోదు చేసి అక్రమంగా అరెస్టు చేయడం చాలా బాధాకరమైన విషయమని మర్చిపోలేని రోజు అని ఏపీ రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం నాడు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పాత్రికేయుల సమావేశాన్ని బీసీ జనార్దన్ రెడ్డి నిర్వహించి మాట్లాడారు. రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందని ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు నుండి నవ్యాంధ్రప్రదేశ్ పునర్నిర్మాణమే లక్ష్యంగా చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నారని మంత్రి బీసీ చెప్పారు. ఇచ్చిన మాట ప్రకారం వృద్ధాప్య పింఛన్ 4 వేలకు పెంచడం, శరవేగంగా ప్రజా రాజధాని అమరావతి పోలవరం నిర్మాణం ప్రకృతి విపత్తుల సమర్థ నిర్వహణ వంటి వాటిపై దృష్టి పెట్టి అభివృద్ధి సంక్షేమం రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు పరుగులు పెట్టిస్తున్నారని బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. గడిచిన ఐదు సంవత్సరాలు టెర్రరిస్టు పాలను తలపించేలా జగన్ పరిపాలన జరిగిందన్నారు. సైకో జగన్ పాలనలో చంద్రబాబు నాయుడు పై 12 కు పైగా తప్పుడు కేసులు నమోదు చేసి మానసిక ఆనందం జగన్ పొందారన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నంద్యాల జిల్లా వాణిజ్య విభాగాల అధ్యక్షులు, గణేష్ ఉత్సవ కమిటీ గౌరవ సలహాదారులు, టంగుటూరి శీనయ్య, మల్లారెడ్డి, కోడి నాగేష్ బాబు, బురానుద్దీన్, కృష్ణా నాయక్, ఖాదర్, ఖాసిం తదితరులు పాల్గొన్నారు.