AGRICULTUREANDHRA PRADESHPROBLEMS

నకిలీ పురుగుల మందుల వ్యాపారంలో దళారీ దందా

దేవనకొండలో మొదలైన నకిలీ పురుగుల మందుల వ్యాపారంలో దళారీ దంద

నకిలీ పురుగు మందులతో రైతులు నిలువుదోపిడీ..

అధికారులు మాత్రం తుతూ మంత్రంగా తనిఖీ..

టార్గెట్స్ పూర్తి చేస్తే విదేశాలకు టూర్.. .

నూటికి 20శాతం వడ్డీ వసూలు …
దళారీ చెప్పిందే వేదం..

ఇదంతా మామూలేనంటున్న అధికార యంత్రాంగం…

దేవనకొండ జూలై 25 యువతరం న్యూస్:

రైతుల అవసరాన్ని ఆసరాగా చేసుకుని కొందరు వ్యాపారులు దళారీ దందాకు దిగుతున్నారు. నకిలీ పురుగు మందులను రైతులకు అంటగడితే మా కంపేని విదేశాలకు టూర్ , మంచి కానుకలు , ఆఫర్లు అంటూ మరి అధికారులకు పరిస్థితి ఎలా అంటే అధికారులకు మేము చుకుంటాం అంటూ నకిలీ పురుగుమందులు అన్నదాతలు అంటగాడుతున్నారు రైతులు మాత్రం అప్పులు చేయక తప్పడం లేదు. గ్రామాల్లో ఉద్దెరపై ఎరువులు, విత్తనాలు, ఫెస్టిసైడ్స్‌ మందులు దొరకడంతో పెట్టుబడి సహాయంతో దీర్ఘకాలిక అప్పులను తీర్చుకుంటున్నారు. ఈ యేడు ఇప్పటికే పంటల సాగు పనులు ప్రారంభం కావడంతో రైతులు పెట్టుబడుల కోసం దళారుల వద్దకు పరుగులు తీస్తున్నారు. పంటలసాగుకు కావాల్సిన ఎరువులు, విత్తనాలు, మందులను సమకూర్చుకుంటున్నారు. ఏటా జరుగుతున్న దళారీ దందా అందరికి తెలిసిన విషయమే అయినప్పటికీ అధికార యంత్రాంగం పట్టించుకోక పోవడంతో రైతులు తీవ్రంగా నష్ట పోవాల్సి వస్తోంది. కొందరు దళారులు కొంత సొమ్మును పెట్టుబడిగా పెడుతూ పంట చేతికందగానే రైతుల నుంచి పదింతల ఆదాయాన్ని పొందుతున్నారు. ముఖ్యంగా మారుమూల గ్రామాల్లో పరిస్థితులు మరీ దారుణంగా కనిపిస్తున్నాయి. అమాయక రైతులకు ఎరువులను అధిక ధరలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. మండల కేంద్రంలో కొందరు బడా వ్యాపారులు పలు గ్రామాల్లో దళారులను నియమించుకుని వారి ద్వారా రైతులకు ఎరువులు, పెస్టిసైడ్స్‌ మందులను అంటగడుతూ అవసరమైన నగదును అనాధికారికంగా గ్రామాల్లో మరెన్నో దుకాణాలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. అయినా అధికారులు చూసిచూడనట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. క్షేత్ర స్థాయిలో అదికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ఇష్టారాజ్యంగా అమ్మకాలు జరుగుతున్నట్లు సమాచారం.చాలా చోట్ల విచ్చలవిడిగా ఎరువులు, మందులు బ్లాక్‌ మార్కెట్‌లోకి తరలిస్తున్నారు. నిబంధనలు పాటించని దుకాణాల నుంచి కొందరు అధికారులకు నెలనెలా మామూళ్ల రూపంలో అందుతున్నట్లు ఆరోపణలు లేకపోలేదు.

గుట్టు చప్పుడు కాకుండా దందా..

రైతుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని కొందరు దళారులు అందినకాడికి దండుకుంటున్నారు. పంటల సాగు సమయంలో ఉద్దెరపై ఎరువులు, మందులను అందించి పంట చేతికి రాగానే పదింతలుగా లాగేసుకుంటున్నారు. నగదుకు ఒక రేటు, ఉద్దెరకు మరో రేటును నిర్ణయిస్తున్నారు పంట చేతికి రాగానే అసలుతో కలిపి వడ్డీని అదనంగా వసూలు చేస్తున్నారు. నూటికి 20 శాతం వడ్డీని విధిస్తున్నారు.ఏదో గత్యంతరం లేక ఉద్దెరపై ఎరువులు, పురుగు మందులను తీసుకుంటున్న రైతులు పండించిన పంటంతా దళారీ పాలే అవుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దేవనకొండ మండలం లో పెరిగిపోతున్న ఫర్టిలైజర్‌ దుకాణాల యజమానులు దళారుల ఆగడాల కు అధికారులు సైతం వత్తాసుపలకడంతో ఈ అక్రమ దందాకు అడ్డూ అదుపూలేకుండా పోతోందని అధికారులు మాత్రం తనిఖీ తుతూ మంత్రంగా నిర్వహిస్తున్నారుని రైతులు వాపోతున్నారు

గ్రామంలోని చిన్న సన్నకారు రైతులకు ఉద్దెరతో ఎరవేస్తూ ఎరువులు, విత్తనాలను సరఫరా చేస్తూ యథేచ్ఛగా దోపిడీ చేస్తున్నారు.ఏటా చేసిన అప్పులను తీర్చితేనే కొత్తగా ఉద్దెరపై ఎరువులు, విత్తనాలను, పురుగుమందులు ఇచ్చేందుకు ముందుకొస్తున్నారు. దళారుల ఇండ్లలోనే ఎరువులను భారీగా నిలువ చేసుకుంటూ జీరో దందాకు ఎగబడుతున్నారు. ఎలాంటి రశీదులు ఇవ్వకుండానే విక్రయాలు జరుపుతున్నట్లు. ఏదైనా తేడా వస్తే తమకేమి తెలియదని చేతులేత్తేస్తున్నారు. మండలం లో సాగుతున్న అక్రమ ఫర్టిలైజర్‌, వ్యాపారం మాఫియాను తలపిస్తున్న అధికారులు మామూలుగానే తీసుకుంటున్నారన్న విమర్శలు వినవస్తున్నాయి. ఇప్పటికైనా వ్యవసాయ అధికారుల యంత్రంగం స్పందించి రైతులకు నాయ్యం జరిగేలా చూడాలని అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మండల రైతులు జిల్లా అధికారులను వేడుకుంటున్నారు

Yuvatharam News

Related Articles

Back to top button
error: Content is protected !!