ANDHRA PRADESHDEVOTIONALWORLD
శాకాంబరిగా శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారు

శాకాంబరీగా శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారు
పామిడి జూలై 26 యువతరం న్యూస్ :
పట్టణంలోని శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి ఆలయంలో శుక్రవారం అమ్మవారు శాకాంబరీగా భక్తులకు దర్శనమిచ్చారు. వేకువజామున నుంచే అమ్మవారికి ప్రాతఃకాల అభిషేకాలు, అర్చనలు, ప్రత్యేక పూజలు చేపట్టారు. అనంతరం వివిధ ఆకుకూరలు, కూరగాయలు, పండ్లతో శాకాంబరీదేవిగా అలంకరించారు. సాయంత్రం వాసవి మాతృ మండలి సభ్యులు లలిత సహస్రనామ పారాయణం చేపట్టారు. వాసవి అష్టోత్తర శత నామావళి, కుంకుమార్చన చేశారు. ఉత్సవ విగ్రహంను ప్రత్యేకంగా అలంకరించిన పల్లకీలో ఉంచి జై వాసవి నామస్మరణలతో ప్రాకారోత్సవం చేపట్టారు. అమ్మవారిని ఊయలలో ఉంచి డోలోత్సవం చేశారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు పంచిపెట్టారు.