ANDHRA PRADESHEDUCATIONWORLD

హల్లెల్ మ్యూజిక్ స్కూల్ గిన్నిస్ వరల్డ్ సాధించిన కర్నూలు పట్టణ వాసి అనంతయ్య

హల్లెల్ మ్యూజిక్ స్కూల్ గిన్నిస్ వరల్డ్ సాధించిన కర్నూలు పట్టణ వాసి అనంతయ్య

కర్నూలు ప్రతినిధి మే 30 యువతరం న్యూస్ :

“హల్లెల్ మ్యూజిక్ స్కూల్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించిన శుభసందర్భముగా మే 29,
2026 న హైదరాబాద్ విక్టోరియా ఆడిటోరియం గచ్చిబౌలి లోని హల్లెల్ మ్యూజిక్ స్కూల్ ప్రాంగణంలో గిన్నిస్ ‘అచీవర్స్ మీట్’ (గిన్నెస్ అచ్చివర్స్ మీట్ ) నిర్వహించబడింది. ఫిబ్రవరి 2, 2026న హైదరాబాదులో గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధుల ఆద్వర్యంలో జరిగినది . ఈ బృహత్తర కార్యక్రమంలో 22 దేశాల నుండి 2,000 మంది కీబోర్డ్ వాయిద్యకారులు గంటపాటు కీబోర్డ్ ఆగకుండా వాయిస్తూ పాల్గొన్నారు. అందులో కీబోర్డ్ వాయించుటలో
ప్రతిభను చూపిన
777 మంది వాయిధ్యకారులు ఎంపికయ్యారు. 770 మందిలో ఒకరుగా మన కర్నూలు వాసి అనంతయ్య ప్రతిభ కనబరిచారు. ఈ ప్రతిభావంతులకు ఈ స్కూలు వ్యవస్థాపకులు అగస్టిన్ దండింగి హైదరాబాద్ లో స్వయంగా సర్టిఫికేట్లు అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో మన పట్టణానికి చెందిన సింగారి శేషయ్య గ్రేసమ్మ , కుమారుడు సింగారి అనంతయ్య పాల్గొని, గిన్నిస్ వరల్డ్ రికార్డులో చోటు సంపాదించాడు. ఈ సందర్భంగా స్కూలు యాజమాన్యం, కుటుంబ సభ్యులు, బంధువులు అభినందించారు.

YUVATHARAM NEWS

Related Articles

Back to top button
error: Content is protected !!