జిల్లా పరిషత్ సమావేశంలో పాల్గొన్న మంత్రులు, ఎంపీలు,ఎమ్మెల్యేలు, అధికారులు

జిల్లా పరిషత్ సమావేశంలో పాల్గొన్న మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు,అధికారులు
కర్నూలు ప్రతినిధి జులై 19 యువతరం న్యూస్:
జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి అధ్యక్షతన వ్యవసాయం, గ్రామీణ నీటి సరఫరా-పారిశుద్ధ్యం, నీటి పారుదల శాఖ, విద్యుత్తు శాఖ తదితర అంశాలపై శుక్రవారం జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు.
ఉమ్మడి కర్నూలు మరియు నంద్యాల జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్, రోడ్లు భవనాలు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రి టి.జి. భరత్, కర్నూలు జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా, నంద్యాల జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి గణియా,కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, నంద్యాల పార్లమెంట్ సభ్యులు బైరెడ్డి శబరి, ఎమ్మెల్సీ మధుసూదన్, పాణ్యం శాసనసభ్యులు గౌరు చరిత,ఎమ్మిగనూరు ఎమ్మెల్యే జయనాగేశ్వర రెడ్డి, పత్తికొండ ఎమ్మెల్యే కె.ఈ.శ్యామ్ కుమార్, కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి, ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి, ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి, నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య, నంద్యాల జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, కర్నూలు, నంద్యాల జిల్లాల జడ్పీటీసీలు, ఎంపీపీలు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.