ANDHRA PRADESHOFFICIALPOLITICS

ప్రజా అభివృద్దే మన అజెండా కావాలి

పల్లె సింధూర రెడ్డి ఎమ్మెల్యే

ప్రజా అభివృద్దే మన అజెండా కావాలి

సంక్షేమ ఫలాలు పేదలకు అందాలన్నదే టీడీపీ ప్రభుత్వ ముఖ్య ఉద్దేశ్యం

ఇందులో అధికారులే ముఖ్య పాత్ర పోషించాలి.

పార్టీల కతీతంగా ప్రజలకు సేవ చేద్దాం.

మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి

అమడగూరు జులై 20 యువతరం న్యూస్:

పుట్టపర్తిలో ప్రజల అభివృద్దే మన అజెండా ఉండాలని పుట్టపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి అధికారులకు పిలుపునిచ్చారు. పుట్టపర్తి ఎంపిడిఓ కార్యాలయంలో శనివారం నిర్వహించిన మండల పరిషత్ సర్వసభ్య సమావేశానికి విచ్చేసిన ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డికి అధికారులు, ప్రజాప్రతినిధులు పుష్ప గుచ్చం అందించి ఘన స్వాగతం పలికారు. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపిపి రమణారెడ్డి ముందుగా సమావేశం ప్రారంభం కాగానే అమగొండ పాల్యం సర్పంచ్ రామచంద్ర మృతికి సంతాపం తెలపాలని సభ్యులను కోరడంతో అందరూ రెండు నిమిషాలు మౌనం పాటించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వ సంక్షేమ ఫలాలు పేదలకు అందాలన్నదే టిడిపి ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం ఉన్నారు. ఈ పొలాలు అందించడంలో ప్రభుత్వ అధికారులు ముఖ్యపాత్ర పోషించాలని ఆమె పిలుపునిచ్చారు. గెలిచిన ప్రజా ప్రతినిధులు పార్టీల కతీతంగా ప్రజలకు సేవ చేయాలని ఆమె కోరారు. అందరం కలిసికట్టుగా పనిచేద్దామని,ప్రజా అభివృద్దే మనందరి ధ్యేయం అన్నారు.

వైద్యం:

మండలంలోని పెడబల్లి లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేసే దిశగా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను కోరారు అన్ని ఆరోగ్య కేంద్రాలలో గర్భిణీ ఎదుర్కొంటున్న సమస్యలను అధికారులతో అడిగి తెలుసుకున్నారు. వారికి మెరుగైన వైద్యం అందించడానికీ ప్రత్యేక గైనకాలజిస్ట్ వైద్య అధికారిని నియామకం చేపట్టి మహిళలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య అధికారులకు ఎమ్మెల్యే సూచించారు. కుక్క కాటు పాముకాటుకు గురయ్యే వారికి సకాలంలో వైది చికిత్సలు అందించి ప్రాణాలు కాపాడేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు చెప్పాలని ఎమ్మెల్యే ప్రశ్నించారు. వాటి సరిపడే మందులను తెప్పించుకొని నిలువ ఉంచుకోవాలని సూచించారు. మండలంలో ఎక్కడ త్రాగునీటి సమస్య రాకుండా చూడాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు ఆదేశించారు. వీరన్నయ్య గారి పల్లి రాజువారిపల్లి బొంతలపల్లి కప్పల బండ రుద్ర ప్రాంతాల్లో నీటి ప్రస్తుత పార్టీ ప్రజలకు అందించే బోరు బావులు మరమ్మతులు మోటార్ రిపేరీలు ,ప్రత్యేక పైపు లైన్లు , ప్రత్యేక ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేస్తే ప్రజలకు త్రాగునీటి సమస్య పరిష్కారం అవుతుందని స్థానిక ప్రజాప్రతినిధులు ఆయా అధికారులను కోరడంతో ఎమ్మెల్యే స్పందించి వెంటనే తదితర గ్రామాల్లో వాటి పరిష్కారానికి అధికారులు తక్షణం చొరచూపాలని ఆదేశించారు.

విద్య:

సాధార్లపల్లిలో మూతబడిన ప్రాథమిక పాఠశాలను తిరిగి పునరుద్ధరించాలని ఎంఈఓ ప్రసాద్ ఎమ్మెల్యేను కోరడంతో వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి వాటిని పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.

వ్యవసాయం:

విత్తన వేరుశనగ కాయలు తీసుకున్న రైతులు సకాలంలో పంటలు సాగు చేసుకునేలా వ్యవసాయ అధికారులు రైతులకు అవగాహన కల్పించాలని ఎమ్మెల్యే సూచించారు. విత్తనం తీసుకొని ఇంకా సాగు చేయలేని రైతులు ఎంతమంది ఉన్నారో ఎందుకు సాగు చేయలేదో వారిని గుర్తించి ఆ వివరాలు తనకు ఇవ్వాలని వ్యవసాయ అధికారులకు ఆదేశించారు. పంట సాగుచేసి అకాల వర్షాలు, ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టపోయిన రైతులకు బీమా సంస్థలు పరిహారం ఇవ్వాలంటే పంటలకు ఈ క్రాప్ తప్పనిసరి అన్నారు .
అదేవిధంగా నకిలీ విత్తనాలు ఎరువులు బెడద గ్రామాల్లో ఎక్కువగా ఉందని వీటికి అడ్డుకట్ట లేకపోతే రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని వ్యవసాయ అధికారులను ఎమ్మెల్యే హెచ్చరించారు.

ఇరిగేషన్:

పుట్టపర్తి మండలంలోని గాజులపల్లి వద్ద రిజర్వాయర్ ఏర్పాటుకు 2019లో అప్పటి మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి ప్రతిపాదనలు పంపారని అది ఏ స్థాయిలో ఉందో తెలపాలని ఇరిగేషన్ అధికారులను కోరారు. ఆ రిజర్వాయర్ ప్రతిపాద ప్రభుత్వానికి అప్పట్లో పంపామని వాటి స్థానంలో 195 చెరువుల నిర్మాణం వైసిపి ప్రభుత్వం తీసుకొచ్చినట్లు అధికారులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు.

ఆర్టీసీ :

పుట్టపర్తి జిల్లా కేంద్రం అయినందున నియోజకవర్గంలోని అన్ని మండలాలకు ప్రత్యేక ఆర్టీసీ బస్సుల సౌకర్యం కల్పించాలని ఆర్టీసీఅధికారులకు ఎమ్మెల్యే సూచించారు.
పుట్టపర్తి నుంచి చెన్నైకి శ్రీశైలం కు నవాబుకోట కోటమీదుగా కొండకమర్ల కు, పుట్టపర్తి నుంచి నల్లమాడ ఓడి చెరువు అమడుగురుకు ప్రత్యేక బస్సు ఏర్పాటు చేస్తే జిల్లా కేంద్రానికి వచ్చే ప్రజలకు రవాణా సౌకర్యం బాగుంటుందని ఎమ్మెల్యే ఆర్టీసీ అధికారులకు సూచించారు. ఎమ్మెల్యే కోరిన ప్రజల సమస్యలపై వెంటనే ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తామని ఆర్టీసీ అధికారులు హామీ ఇచ్చారు.
*విద్యుత్* : రైతులకు సకాలంలో వ్యవసాయ కనెక్షన్లు ట్రాన్స్ఫార్మర్లు సంబంధిత మెటీరియల్ సకాలంలో అందించి ఆదుకోవాలని ఆ శాఖ అధికారులకు ఎమ్మెల్యే సూచించారు. విద్యుత్ అధికారులు నిర్లక్ష్యం వీడి రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని సూచించారు. విద్యుత్ కోతలు లేకుండా రైతులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించాలని ఆదేశించారు. గ్రామాల్లో రాగిణి రెడ్డి పథకాలకు విద్యుత్ అంతరాయం లేకుండా ప్రత్యేక ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేసి ఇబ్బంది లేకుండా చూడాలని స్థానిక సర్పంచులు శ్రీనివాసులు, చిన్న పెద్దన్న ,ప్రవీణ్ ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావడంతో వెంటనే ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని విద్యుత్ అధికారులకు ఎమ్మెల్యే ఆదేశించారు.
గ్రామాల్లో విద్యుత్ అధికారులు సక్రమంగా పనిచేయడం లేదని బొంతలపల్లి సర్పంచ్ శ్రీనివాసులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. ఇలాంటి సమస్య భవిష్యత్ చూడాలని ఎమ్మెల్యే సంబంధిత అధికారులను హెచ్చరించారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలను అధికారులు అక్కడికక్కడే పరిష్కారం చూపాలని అధికారులకు ఆదేశించారు. ప్రజల సమస్యలపై అధికారులు నిర్లక్ష్యం వహిస్తే భవిష్యత్తులో వారిపై చర్యలు తప్పవన్నారు. మొదటి సారిగా అధికారుల దృష్టికి తీసుకొచ్చి ఆ తర్వాత అది పునరావృతం కాకుండా చూసుకోవాలని ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి హెచ్చరించారు. అనంతరం తొలిసారి మండల పరిషత్ సర్వసభ్య సమావేశానికి విచ్చేసిన తొలి మహిళ ఎమ్మెల్యే గా గెలిచిన పల్లె సింధూర రెడ్డిని స్థానిక సర్పంచులు ఎంపీటీసీలు అధికారులు శాలువాతో సత్కరించి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపిడిఓ ,తహశీల్దార్ , హెల్త్ ,అగ్రికల్చర్, హార్టికల్చర్ సిరికల్చర్ ఇరిగేషన్, ఉపాధి హామీ, ఆర్డబ్ల్యూఎస్, ఇరిగేషన్, విద్యుత్ ,ఇతర శాఖల అధికారులు,సర్పంచ్ లు ,ఎంపీటీసీ లు ,ఇతర ప్రజా ప్రతినిధులు ,ప్రభుత్వ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Yuvatharam News

Related Articles

Back to top button
error: Content is protected !!