ANDHRA PRADESHOFFICIALSTATE NEWS
ముచ్చుమర్రి బాలిక అదృశ్యం కేసు ఎఫెక్ట్: ఇద్దరు పోలీస్ అధికారులు సస్పెండ్
కర్నూల్ రేంజ్ డీఐజీ సిహెచ్ విజయ రావు

విధుల పట్ల నిర్లక్ష్యం, క్రమశిక్షణ ఉల్లంఘించిన ఇద్దరు పోలీసు అధికారులను సస్పెండ్ చేసిన
కర్నూలు రేంజ్ డిఐజి సిహెచ్. విజయరావు ఐపియస్
కర్నూలు ప్రతినిధి జులై 17 యువతరం న్యూస్:
కర్నూలు రేంజ్ పరిధిలోని నంద్యాల జిల్లా, నందికొట్కూరు రూరల్ సర్కిల్ సిఐ ఓ. విజయ భాస్కర్, ముచ్చుమర్రి పోలీసు స్టేషన్ ఎస్సై ఆర్ . జయ శేఖర్ లను కర్నూలు రేంజ్ డిఐజి సిహెచ్. విజయరావు ఐపియస్ బుధవారం సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
ముచ్చుమర్రి పోలీసుస్టేషన్ పరిధిలో ఒక బాలిక అదృశ్యం కేసులో విధుల పట్ల అలసత్వం వహించి , క్రమశిక్షణ ఉల్లంఘించడంతో నందికొట్కూరు రూరల్ సర్కిల్ సిఐ, ముచ్చుమర్రి ఎస్సై పై కర్నూలు రేంజ్ డిఐజి చర్యలు తీసుకున్నారు.
విధుల పట్ల ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.