
అసాంఘికలపై ఉక్కు పాదం
క్రిష్ణగిరి జులై 6 యువతరం న్యూస్:
అసాంఘికలపై ఉక్కు పాదం మోపుతామని కృష్ణగిరి ఎస్సై ఖాజావలి పేర్కొన్నారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మండలంలో ప్రజలకు ఏ సమస్య వచ్చినా పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించాలన్నారు. చట్టాన్ని ఎవరు చేతులోనికి తీసుకోవద్దని హెచ్చరించారు. చిన్నచిన్న సమస్యలకు గొడవ పడకుండా ఉండడమే మంచిది అన్నారు. ఒకసారి పోలీస్ స్టేషన్ లో పేర్లు నమోదు అవుతే యువకులకు ఉద్యోగాలు రావు అన్నారు. కాబట్టి క్షణికా వేశానికి లోను కాకుండా ఆలోచనతో సమస్యలను పరిష్కరించుకోవాలన్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేవారు ఎవరైనా సరే సమాచారం తెలిస్తే తమకు సమాచారం అందించవచ్చు అన్నారు.