ANDHRA PRADESHOFFICIALPOLITICS
వైసీపీ నేత నుంచి ప్రాణహాని

వైసీపీ నేత నుంచి ప్రాణహాని
చంపి రైలు కింద వేసేందుకు కుట్ర
కాలనీలో కక్షలకు ఆజ్యం :
సామాజిక మాధ్యమాల్లో బాధితురాలు సుబ్బమ్మ ఆవేదన
గార్లదిన్నె జూలై 4 :
సిరివరం గ్రామానికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు నుంచి తనకు ప్రాణహాని ఉందని అదే గ్రామానికి చెందిన జింకల సుబ్బమ్మ గురువారం సామాజిక మాధ్యమాల వేదికగా ఆరోపించారు. తమ కుటుంబం పై వైసిపి కుటుంబం కక్ష పెంచుకొని దాడులు చేపిస్తున్నారని ఈ సందర్భంగా ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. నిజాలు బయట పెడుతున్నందుకు తన ఇంటికి వేసిన తాళాలు పగలగొట్టి, వారి సొంత తాళాలు వేసి తాను ఇంట్లోకి రాకుండా చేయించారని విలపించారు. తనను చంపి రైలు కింద వేస్తే కేసు ఉండదని బెదిరిస్తున్నారని సుబ్బమ్మ ఆరోపించారు. గ్రామంలో కక్షలను పెంచి పోషిస్తున్నారని ఆమె అన్నారు. అధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని ఆమె కోరారు.