భవన నిర్మాణ కార్మికులకు ఇండ్లు, ఇళ్ల స్థలాలు ఇవ్వాలి ఇవ్వాలి

భవన నిర్మాణ కార్మికులకు ఇండ్లు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సిఐటియు
నాయకులు కార్మికులు డిమాండ్
(యువతరం జనవరి 31) అమడగూరు విలేకరి:
ఓబుల దేవర చెరువు మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయం దగ్గర భవన నిర్మాణ కార్మికులకు ఇండ్లు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సిఐటియు నాయకులు భవన నిర్మాణ కార్మికులు ధర్నాలు చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు కుళ్లాయప్ప పోరాటాల శ్రీరాములు మాట్లాడుతూ రకరకాల వృత్తులు పని చేస్తున్నటువంటి భవన నిర్మాణ కార్మికులకు గతంలో ఇండ్లు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పిన ప్రభుత్వం చాలాసార్లు బాగున్నాను నిర్మాణ కార్మికులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని అర్జీలు ఇచ్చిన ప్రభుత్వం పట్టించుకోవడం లేదని భవిష్యత్తులో నిర్మాణ కార్మికుల సమస్యలపై దసలవారీగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని సిఐటియు నాయకులు డిమాండ్ చేశారు. అదేవిధంగా ఎన్నిసార్లు ఇండ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పిన భవన నిర్మాణ కార్మికుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల అధ్యక్షుడు కుళ్లాయప్ప, మండల కార్యదర్శి పోరాటాల శ్రీరాములు, రమణ, సూరి, రవి, అంజినప్ప, నాగరాజు,కేశవ,వెంకటేష్, భవన నిర్మాణ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.