ANDHRA PRADESHCRIME NEWSSTATE NEWS
రూ.43.20 లక్షలు స్వాధీనం

రూ.40.20 లక్షల స్వాధీనం
(యువతరం జనవరి 27) వెల్దుర్తి విలేఖరి:
రాబోవు సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా ఉన్నత అధికారుల ఉత్తర్వుల మేరకు వాహనాల తనిఖీ నిమిత్తం వెల్దుర్తి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం సురేష్ కుమార్ రెడ్డి మరియు వెల్దుర్తి, క్రిష్ణగిరి ఎస్సైలు మరియు సిబ్బంది తోపాటు అముకతాడు టోల్ ప్లాజా వద్ద వాహనాలు తనిఖి చేస్తుండగా 19.30 గంటలకు హైదరాబాద్ వైపు నుండి అనంతపూర్ వైపునకు ఒక ప్రైవేట్ బస్ PY 01 DA 7691 రాగ, బస్ ను సిబ్బంది సహాయముతో ఆపి తనిఖి చేయగా బస్ నందు ఒక వ్యక్తి ఎర్రగుడి సాయి ప్రదీప్ తండ్రి వై వెంకట శివారెడ్డి అనంతపూర్, అతని వద్ద ఎలాంటి ఆధారాలు లేని నగదు మొత్తం రూ. 43, 20000(43 లక్షల ఇరవై వేల రూపాయిలు) ఉండి.నవి. అంతట సదరు నగదు ను తదుపరి చర్య నిమిత్తం స్వాధీన పరుచు కోరడమైనది. ఈ కార్యక్రమంలో ఆర్ఐ మస్తాన్ పాల్గొన్నారు.