బి ఆర్ ఎస్ పార్టీకి బిగ్ షాక్

బి.ఆర్.ఎస్ పార్టీకి బిగ్ షాక్
వోడితల ప్రణవ్ నాయకత్వం బలపరుస్తూ
కాంగ్రెస్ పార్టీ లో చేరిన జమ్మికుంట మున్సిపాలిటీ బి.ఆర్.ఎస్. పార్టీ చెందిన 13 మంది మున్సిపల్ కౌన్సిలర్లు
(యువతరం జనవరి 31) జమ్మికుంట విలేఖరి:
హైదరాబాద్ గాంధీ భవన్ లో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి వోడితల ప్రణవ్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సమక్షంలో
13 మంది జమ్మికుంట మున్సిపల్ వార్డు కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు.
జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని 13 మంది కౌన్సిలర్లు..తమ వార్డ్ లో అభివృద్ధి పనులు కాంగ్రెస్ పార్టీ చేపట్టిన సంక్షేమ ఫలాలు ప్రజలు లబ్ధి పొందాలంటే కాంగ్రెస్ పార్టీ తోనే సాధ్యమని భావించి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నమని అంటున్నారు..
ఇదే తరహాలో హుజురాబాద్ నియోజకవర్గంలోని పలు మండలంలోని సర్పంచులు గత కొద్ది రోజుల క్రితం హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ తీర్థాన్ని పుచ్చుకున్నారు.
ఇదే విధంగా కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు కొనసాగితే హుజరాబాద్ లో దశలవారీగా బీ.ఆర్ఎస్ ఖాళీఅవుతుంది అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
బి.ఆర్.ఎస్ పార్టీ ప్రజా
ప్రతినిధులు పెద్ద మొత్తంలో కాంగ్రెస్ పార్టీ లో చేరుతారని వార్తలు చెక్కర్లు కొడుతున్నాయి.
ఈ కార్యక్రమంలో హుజరాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ వోడితల ప్రణవ్ తో పి.సి.సి. మెంబర్ పత్తి కృష్ణారెడ్డి,తుమ్మేటి సమ్మీ రెడ్డి,పొన్నగంటి మల్లయ్య గారు దొంత రమేష్,
జమ్మికుంట టౌన్ అధ్యక్షుడు సుంకరి రమేష్,
ఇల్లంతకుంట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు
ఇంగిలే రామారావు,
గడ్డం దీక్షిత్ ఎర్రం సతీష్ రెడ్డి పాల్గొన్నారు.
కాంగ్రెస్ పార్టీ లో చేరిన వారిలో 13మంది
జమ్మికుంట మున్సిపల్ కౌన్సిలర్లు.
బొంగోని వీరన్న ,
మరపల్లి బిక్షపతి,
మేడి పల్లి రవీందర్,
ఎలగందుల స్వరూప శ్రీహరి,
పిట్టల శ్వేత రమేష్,
పొన్నగంటి సారంగం,
పొన్నగంటి రాము,
బిట్ల కళావతి మోహన్,
కుతాడి రాజయ్య,
దేశిని రాధ సదానందం,
గుల్లి పోలమ్మ మొగిలి,
దిడ్డి రాంమోహన్,
రావికంటి రాజ్ కుమార్ లు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు.