OFFICIALSTATE NEWSTELANGANA

సర్పంచ్, ఉప సర్పంచ్ కు చెక్ పవర్ రద్దు

సర్పంచ్,ఉపసర్పంచ్ కి చెక్ పవర్ రద్దు

సంవత్సరాలు గడవడంతో కోట్ల రూపాయిల అవినీతిని లక్షలలో చూపించారని ఆరోపణ

(యువతరం జనవరి 21) అశ్వరావుపేట ప్రతినిధి:

దమ్మపేట మండల కేంద్రంలోని మేజర్ పంచాయతీ అయినటువంటి దమ్మపేట గ్రామపంచాయతీలో నిధులు దుర్వినియోగం జరిగింది అని ఎట్టకేలకు నిర్ధారణ జరిగింది. దమ్మపేట సర్పంచ్ ఉప సర్పంచ్ చెక్ పవర్లను రద్దు చేస్తూ 5,49,750 లక్షల రూపాయల రికవరీకి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.కానీ అసలు విషయం ఏమిటి అంటే సంవత్సరాలు గడవటంతో కోట్లల్లో జరిగిన అవినీతిని లక్షల్లో చూపించడంతో అనుమానం వ్యక్తం అవుతుంది. విషయంలోకి వెళ్తే 1కోటి 26 లక్షల రూపాయల అవినీతి జరిగింది అని పంచాయతీ వార్డు మెంబర్ల సభ్యులు 24 .8.2020 సంవత్సరంలో జిల్లా కలెక్టర్ కి పిర్యాదు చేయగా 12 .9 .2020 సంవత్సరంలో భద్రాచలం డి ఎల్ పి ఓ వచ్చి దర్యాప్తు చెయ్యగా 30 లక్షల 98650 రూపాయల నిధులు దుర్వినియోగం జరిగిందని వివరాలు ఇవ్వడం జరిగింది, అప్పటి దర్యాప్తు నివేదికను ఆధారంగా చేసుకొని 3. 11 .2020 న కలెక్టర్ బాధ్యులకు షోకాష్ నోటీస్ ఇవ్వటం జరిగింది, మరలా తిరిగి 8 .1 .2021 సంవత్సరంలో సుజాతనగర్ ఎంపీ ఓ వచ్చి ఎంక్వయిరీ చేయగా మరల 30 లక్షల 98650 రూపాయల అవినీతి కచ్చితంగా జరిగిందని నివేదికని సమర్పించారు. 15. 2 .2021 వ సంవత్సరంలో దానికి బాధ్యులైనటువంటి సర్పంచ్ మరియు ఉప సర్పంచ్లను 6 నెలలు సస్పెండ్ చేయడం జరిగింది. తర్వాత కోర్టు నుంచి స్టేట్ తెచ్చి సస్పెండ్ ఉత్పరులను రద్దుచేసి మరలా సర్పంచ్ ,ఉప సర్పంచ్ గ విధులను కొనసాగించారు, మరల నవంబర్ 2023 వ సంవత్సరంలో కొత్తగూడెం డిఎల్పిఓ పంచాయితీ నిధుల దుర్వినియోగం కోసం దర్యాప్తుకి వచ్చి పంచాయతీకి సంబంధించినటువంటి వార్డు మెంబర్లకి ఎటువంటి సమాచారం ఇవ్వకుండా దర్యాప్తు చేసి గతంలో రెండుసార్లు దర్యాప్తు చెయ్యగా వచ్చిన 30 లక్షల 98650 రూపాయల అవినీతిని కేవలం 5 లక్షల 49750 రూపాయలు గ తేల్చటం జరిగిందని తేల్చారు. మొత్తానికి గ్రామపంచాయతీలో అవుతే అవినీతి జరిగిందని తేల్చినప్పటికీ ఎన్నో సంవత్సరాలుగా ఎంతో మంది అధికారులు వచ్చి తనిఖీ చేయగా 30 లక్షల రూపాయల అవినీతిని కేవలం 5 లక్షల రూపాయలుగా చూపించడంతో ప్రజలలో మరియు పంచాయతీకి సంబంధించినటువంటి వార్డు నెంబర్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై కొంతమంది ప్రజాప్రతినిధులు ప్రజలు అనుమానం నివృత్తి చేసుకోవటం కోసం స్థానిక ఎమ్మెల్యే మరియు మంత్రుల దగ్గరికి వెళ్ళటానికి ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు అని సమాచారం.

Yuvatharam News

Related Articles

Back to top button
error: Content is protected !!