జెసి ప్రభాకర్ రెడ్డికి గ్రామాలలో బ్రహ్మరథం

గ్రామాల్లో జేసీ ప్రభాకరుడు కు బ్రహ్మరథం
ఘన స్వాగతం పలికిన కొండూరు కేశవరెడ్డి, కాంట్రాక్టర్ హరినాథ్ రెడ్డి
రెండోరోజు నాలుగు గ్రామాల్లో యువచైతన్య రథ బస్సుయాత్ర
(యువతరం జనవరి 19) పెద్దవడుగూరు విలేఖరి:
గ్రామీణ ప్రాంతాలను మరింత అభివృద్ధి చేసేలా కృషిచేస్తానని తెదేపాను గెలిపించాలని తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జే.సీ ప్రభాకరరెడ్డి పేర్కొన్నారు. యువచైతన్య రథ బస్సుయాత్రలో భాగంగా పెద్దవడుగూరు మండలంలోని కొండూరు, వీరన్నపల్లి, నాగలాపురం, కొట్టాలపల్లి గ్రామాల్లో గురువారం ఆయన బస్సుయాత్ర నిర్వహించారు. ఈసందర్భంగా ఆయా గ్రామాల్లో మహిళలు, చిన్నారులు, యువతీ, యువకులు, వృద్ధులతో ప్రత్యేకంగా చర్చించారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులకు బిన్నంగా తాము అధికారంలోకి వస్తే మరింత అభివృద్ధి చేసేలా చూస్తామన్నారు. ఆయా గ్రామాల్లో తాగునీటి సమస్య అధికంగా ఉన్నందున ఈసమస్యలపై ఇక్కడి ప్రజలు జే.సీ దృష్టికి తీసుకోచ్చారు. తప్పక మీ సమస్యలకు పరిష్కారం చూపుతానని ఆయన ప్రజలకు భరోసా ఇచ్చారు. ప్రస్తుత అవినీతి పాలనలో గ్రామాల్లోని ప్రజల్లో ప్రజాచైతన్యం తీసుకురావడం కోసమే తాను పర్యటించి ప్రజాసమస్యలను తెలుసుకుని రానున్న రోజుల్లో తీర్చేందుకు కృషిచేస్తానని చెప్పారు. ఇక్కడి గ్రామాల్లో పర్యటించిన ఆయన ముఖ్యంగా మహిళల వద్దకు వెళ్లి గ్రామాల్లో నెలకొన్న పలు సమస్యలను తెలుసుకున్నారు. 13 రోజుల పాటు జరిగే బస్సుయాత్రలో గ్రామాలలో పర్యటించిన పర్యటించనున్నారు.కార్యక్రమంలో గన్నెవారిపల్లి మాజీ సర్పంచి చింబిలి వెంకటరమణ, తెదేపా నాయకులు కొండూరు కేశవరెడ్డి,క్లాస్ వన్ కాంట్రాక్టర్ కొండూరు హరినాథ్ రెడ్డి,ఆవులాంపల్లి కేశవరెడ్డి, బాలిరెడ్డి, గంగరాజు, దివాకరరెడ్డి, పరమేశ్వరరెడ్డి, హరికృష్ణారెడ్డి, హరికృష్ణారావు, రవిశేఖరరెడ్డి, ఇటుకనాలు, రంగప్ప, ప్రసాద్యాదవ్, రమేష్, చిరంజీవులు, తదితరులు పాల్గొన్నారు.