వరిగడ్డి తింటూ అంగన్వాడీలు నిరసన

వరిగడ్డి తింటూ అంగన్వాడీలు నిరసన
(యువతరం జనవరి 6) వెల్దుర్తి విలేఖరి:
వరిగడ్డి తింటూ అంగన్వాడీలు నిరసన తెలిపారు. గత 25 రోజులుగా తమ న్యాయమైన డిమాండ్ల కోసం అంగన్వాడీలు నిరసన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. మండల కేంద్రమైన వెల్దుర్తి లో తహసిల్దార్ మరియు ఎంపీడీవో కార్యాలయం ఆవరణంలో అంగన్వాడీల నిరసన వ్యక్తం చేస్తున్నారు. 25 రోజు సందర్భంగా అంగన్వాడీలు వరిగడ్డి తింటూ ప్రభుత్వానికి నిరసన వ్యక్తం చేశారు.
వెల్దుర్తి ప్రాజెక్ట్, రామాల్లకోట సెక్టార్ లింగాలపల్లి అంగన్వాడీ హెల్పర్ దస్తగిరమ్మ సమ్మెకి హాజరు కావడానికి వస్తూ లింగాలపల్లి గ్రామ మార్గం లో అనుకోకుండా బైక్ పైనుండి కింద పడి తీవ్రంగా గాయపడడం జరిగింది. కుటుంబసభ్యులు కర్నూల్ కి తరిలించారు. హెల్పర్ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. వెల్దుర్తి ప్రాజెక్ట్ టీచర్స్ ఆసుపత్రికి వెళ్లి పరామర్శించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వెల్దుర్తి ప్రాజెక్టు ప్రధాన కార్యదర్శి చాందిని, ఈదమ్మ, వరలక్ష్మి, ఆదిలక్ష్మి,సుజాత, హరిత ,శిరీష, వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.