ANDHRA PRADESHDEVOTIONALWORLD
ఇంటింటికి అయోధ్య శ్రీరాములు వారి అక్షింతల పంపిణీ

ఇంటింటికి అయోధ్య శ్రీరాములవారి అక్షింతల పంపిణీ
( యువతరం జనవరి 6) కొత్తపల్లి విలేకరి:
జనవరి 22 వ తేది అయోధ్యలో ప్రతిష్ట కానున్న శ్రీరామ మందిరం నుంచి అక్షింత పూజలు అనంతరం మండలంలోని అన్ని గ్రామాలకు, ప్రతి ఇంటికి పంపించడంలో భాగంగా శుక్రవారం సమరసత సేవా ఫౌండేషన్ సబ్ డివిజన్ కన్వీనర్ మల్లెల హనుమంతరెడ్డి ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని కొత్తపల్లి గ్రామంలో పెద్దలు, గ్రామస్తులు, చిన్నారులు గ్రామ శివారుల నుంచి శ్రీరాముల వారి గుడి వరకు రామకీర్తనలతో ఘన స్వాగతం పలికారు. జై శ్రీరామ్ నినాదాలతో భాజా, భజంత్రీల నడుమ గ్రామాలలో ఇంటింటికి అక్షింతలు అందజేయున్నట్లు గ్రామాలపెద్దలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సబ్ డివిజన్ ధర్మప్రచారక్ సింగారపు రాజేష్, మండల ప్రముక్ రామకృష్ణ,ఆడపాలకృష్ణుడు చాకలి చెన్నయ్య నరాల వినోద్ కుమార్ రెడ్డి, మహిళలు, యువకులు, భజనభక్తులు పాల్గొన్నారు.