ANDHRA PRADESHDEVOTIONALWORLD

శ్రీగిరి క్షేత్రం నందు శ్రీ బయలు వీరభద్ర స్వామి వారికి విశేష పూజార్చన

శ్రీగిరి క్షేత్రం నందు శ్రీ బయలు వీరభద్ర స్వామి వారికి విశేష పూజార్చన

(యువతరం నవంబర్ 28) శ్రీశైలం ప్రతినిధి:

ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ శిలక్షేత్రం నందు శ్రీ బయలు వీరభద్ర స్వామివారికి విశేష పూజా అలంకరణ నిర్వహించబడింది. లోక కళ్యాణం కోసం శ్రీశైల క్షేత్రపాలకుడు అయిన శ్రీ బయలు వీరభద్ర స్వామివారికి ప్రదోషకాలను విశేష పూజలు నిర్వహించబడింది. ప్రతి మంగళవారము మరియు అమావాస్య రోజులలో క్షేత్రపాలకుడైన శ్రీ బయలు వీరభద్ర స్వామివారికి ఈ విశేష అభిషేకము మరియు అర్చనలను నిర్వహిస్తారు. శ్రీ బయలు వీరభద్ర స్వామి వారు శివ భక్త గణాలకు అధిపతి. అదేవిధంగా శ్రీశైల క్షేత్ర పాలకుడుగా క్షేత్రానికి ప్రారంభంలో ఆరు బయట ఉండి ఎటువంటి అచ్చా దన ఆలయం లేకుండగా బయలుగా దర్శనమిస్తాడు. కనుక ఆయనకు శ్రీ బయలు వీరభద్ర స్వామి అని పేరు వచ్చింది. ప్రసన్న వదనంతో కిరీటమకుటాన్ని కలిగి ఉండి దశపుజుడైన ఈ స్వామి వారు పది చేతులతో వివిధ రకాల ఆయుధాలతో దర్శనమిస్తాడు. శ్రీ బయలు వీరభద్ర స్వామి వారిని దర్శించినంత మాత్రాన్ని ఎంతటి క్లిష్ట సమస్య అయినా తొలగిపోతాయని, వ్యాధులు నశించి, ఆయురారోగ్యాలు చేకూరి తాయని ప్రసిద్ధి. ముఖ్యంగా ఆగమ సాంప్రదాయంలో క్షేత్రపాలక పూజకు చాలా విశేష స్థానం ఉంది. క్షేత్రపాలకుడైన శ్రీ బయలు వీరభద్ర స్వామివారికి పూజలు చేయడం వలన అక్షేత్రంలో ఉన్నటువంటి భక్తులు ఎటువంటి భయ బాధలు లేకుండా సుఖ సంతోషాలతో ఉంటారు. మంగళవారం ఆదివారం మరియు అమావాస్య రోజులలో చేసే శ్రీ బయలు వీరభద్ర స్వామి పూజ అనేక ఫలితాలు ఇస్తుందని ఆగమ శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ స్వామి వారి పూజతో సకల గ్రహ, అరిష్ట దోషాలు, దుష్ట గ్రహ పీడలు తొలగిపోతాయి. అదేవిధంగా సంతానం, ఐశ్వర్యం మొదలైన అనేక శుభ ఫలితాలు చేకూరుతాయి. ఈ పూజారికాలలో పంచామృతాలతోనూ, బిల్వదకం ,హరిద్రోదకం, కుంకుమోదకం, బస్మోదకం, హరిద్రోదకం , పుష్పోదకం, శుద్ధ జలాలతో శ్రీ బయలు వీరభద్ర స్వామి వారికి అభిషేకం నిర్వహించడం జరుగుతుంది.

Yuvatharam News

Related Articles

Back to top button
error: Content is protected !!