ANDHRA PRADESHDEVOTIONALWORLD
శ్రీశైలం క్షేత్రంలో తగ్గని భక్తుల రద్దీ

శ్రీశైలం క్షేత్రంలో తగ్గని భక్తుల రద్దీ
(యువతరం నవంబర్ 28) శ్రీశైలం ప్రతినిధి:
ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైల క్షేత్రం నందు భక్తుల రద్దీతో కిటకిటలాడింది. క్షేత్రంలోని ఆలయం ముందు భాగంలోని గంగాధర మండపం వద్ద కార్తీకదీప లతో విలసిల్లింది. తెలుగు రాష్ట్ర భక్తులు కాకుండా మహారాష్ట్ర మధ్యప్రదేశ్ తమిళనాడు కర్ణాటక పశ్చిమబెంగాల్ వంటి రాష్ట్రాల నుంచి భక్తులు అధికంగా తరలివచ్చారు. శ్రీ స్వామి అమ్మవార్ల దర్శనానికి భక్తులు వేకువజామున పాతాళ గంగలో పుణ్యస్నానాలు ఆచరించి నది స్నానం నది దీపారాధన చేసి శ్రీ స్వామి అమ్మవార్ల దర్శనానికి బారులు తీరారు. క్యూ కంపార్ట్మెంట్లు, క్యూ లైన్లు భక్తులతో కిక్కిరిశాయి కార్తీక మాస సందర్భంగా ఉభయ ఆలయాలు కార్తీకదీపలతో శోభిలాయి.