శ్రీశైలం క్షేత్రంలో శ్రీ నందీశ్వర స్వామి వారికి విశేష పూజ

శ్రీశైలం క్షేత్రంలో శ్రీ నందీశ్వర స్వామి వారికి విశేష పూజ
యువతరం నవంబర్ 28 శ్రీశైలం ప్రతినిధి:
ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైల క్షేత్రం నందు ఆలయంలోని శ్రీ నందీశ్వర స్వామి( శనగల బసవన్న) వారికి విశేష పూజ నిర్వహించబడింది. ప్రతి మంగళవారము మరియు త్రయోదశి రోజున దేవస్థానం ఈ పూజను జరిపించబడుతుంది. ప్రదోషకాలంలో అనగా సాయం సంధ్యా సమయంలో ఈ విశేష పూజలు నిర్వహించడం జరుగుతుంది. వి ఈ విశేష అర్చనలో ముందుగా లోక క్షేమాన్ని కాంక్షిస్తూ దేశం శాంతి సౌభాగ్యాలతో వెలసిల్లాలని ప్రకృతి వైపరీత్యాలు సంభవించకుండా, సకాలంలో తగినంత వర్షాలు కురిసి ,పంటలు బాగా పండాలని ,పాడి సమృద్ధిగా ఉండాలని, జనులకు ఆయురారోగ్యాలు కలిగి, వారికి అకాల మరణాలు రాకుండా, ఉండాలని దేశంలో అగ్ని ప్రమాదాలు ,వాహన ప్రమాదాలు, మొదలైనవి జరగకుండా ఉండాలని జనులందరూ సుఖశాంతులతో ఉండాలంటూ అర్చక స్వాములు వేద పండితులు ఈ సంకల్పాన్ని చెప్పడం జరుగుతుంది. అనంతరం ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా జరిగేందుకు శ్రీ మహాగణపతి పూజను జరిపించబడుతుంది. ఆ తర్వాత నందీశ్వర స్వామి వారికి శాస్త్రస్త్రకంగా పంచామృతాలతోనూ, ఫాలోదోకాలతోనూ, హరిద్వాదకం, కుంకుమోదకం, గందోదకం బస్మోదకం, రుద్రాక్షోదకం, బిల్వోదకం ,పుష్పోదకం, సువర్ణదకం మరియు మల్లికాగుండంలోని శుద్ధ జలంతో అభిషేకం నిర్వహిస్తారు తరువాత శ్రీ నందీశ్వర స్వామి వారికి అన్నాభిషేకం నిర్వహించబడుతుంది. వృషభ సూక్తం మొదలైన వేదమంత్రాలతో శాస్త్రస్త్రకంగా ఈ విశేష అభిషేకాన్ని చేయడం జరుగుతుంది. తరువాత నందీశ్వర స్వామి వారికి నూతన వస్త్ర సమర్పణ విశేష పుష్పార్చనలు చేస్తారు.