OFFICIALSTATE NEWSTELANGANA
మద్యం దుకాణాలు, బార్లు, కల్లు డిపోలు బంద్: ఎన్ని రోజులు అంటే

మద్యం దుకాణాలు,బార్లు,కల్లు డిపోలు బంద్
(యువతరం నవంబర్ 28) భద్రాద్రి ప్రతినిధి:
30వ తేదీన జరగబోవు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలో ఉన్న అన్ని మద్యం దుకాణాలు, బార్లు, కల్లు డిపోలు మంగళవారం సాయంత్రం 04 గంటల నుంచి 30 వ తారీకు పోలింగ్ ముగిసే వరకు మూసి ఉంచడం జరుగుతుందని జిల్లా అబ్కారీ అధికారి జానయ్య తెలిపారు. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని, అధికారులు, సిబ్బంది నిరంతరం పర్యవేక్షిస్తుoటారన్నారు. ప్రజలు ఏమైనా పిర్యాదులు ఉంటే జిల్లా అబ్కారీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కాల్ సెంటర్ 08744-242464 కు ఫోన్ కు తెలియచేయాలని ఆయన తెలిపారు.