శ్రీశైలం క్షేత్రం నందు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి (కుమారస్వామి) వారికి విశేష పూజాలంకరణ

శ్రీశైలం క్షేత్రం నందు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి( కుమారస్వామి) వారికి విశేష పూజాలంకరణ
(యువతరం నవంబర్ 28) శ్రీశైలం ప్రతినిధి:
ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీలక్షేత్రం నందు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి విశేష పూజ అలంకరణ నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి విశేష పూజలను నిర్వహించారు. ప్రతి మంగళవారం మరియు కృత్తికా నక్షత్రం షష్టి తిధి రోజులలో శ్రీ సుబ్రహ్మణ్యం స్వామి వారికి విశేష అభిషేకము మరియు పూజాదికాలు నిర్వహించబడతాయి. కుమారస్వామి వారికి పూజలు జరపడం వలన లోక కళ్యాణమే కాకుండా ప్రతి ఒక్కరికి ఉద్యోగ వ్యాపార వ్యవహారాల్లో ఆటుపోట్లు తొలగి ఆయా పనులు సక్రమంగా జరుగుతాయి. సుబ్రహ్మణ్యస్వామి అనుగ్రహంతో శత్రు బాధలు గ్రహ పీడలు దృష్టి దోషాలు మొదలైనవి తొలగిపోతాయి. అలాగే సంతానం కోసం పూజించే వారికి తప్పక సంతాన భాగ్యం లభిస్తుందని చెప్పబడుతుంది. ఈ అభిషేకానికి ముందుగా దేశం శాంతి సౌభాగ్యాలతో విలసిల్లాలని ప్రకృతి వైపరీత్యాలు సంభవించకుండా సకాలంలో తగినంత వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని పాడి సమృద్ధిగా ఉండాలని జనులకు ఆయురారోగ్యాలు కలిగి వారికి అకాల మరణాలు రాకుండా ఉండాలని దేశంలో అగ్ని ప్రమాదాలు వాహన ప్రమాదాలు మొదలైనవి జరగకుండా ఉండాలని జనులందరూ సుఖశాంతులతో ఉండాలని అంటూ అర్చక స్వాములు సంకల్పాన్ని పట్టించారు. తర్వాత కార్యక్రమం నిర్విఘ్నంగా జరిగేందుకు శ్రీ మహాగణపతి పూజను జరుపబడుతుంది. అనంతరం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం అర్చన తర్వాత సుబ్రహ్మణ్య స్తోత్రం పారాయణాలు చేయబడతాయి శ్రీ సుబ్రహ్మణ్యస్వామి అభిషేకంలో స్వామివారికి పంచామృతాలైన పాలు పెరుగు తేనె నెయ్యి కొబ్బరినీళ్లు మరియు వివిధ పండ్ల రసాలతో అభిషేక కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ముఖ్యంగా వివిధ పళ్ళ రసాలతో చేసే అభిషేకంతో ఎంతో ఫలితం ఉంటుందని ఆగమనాలు చెబుతున్నాయి.