ANDHRA PRADESHPROBLEMS
శ్రీశైలం ఘాట్ రోడ్ లో ఎలుగుబంటి హల్ చల్

శ్రీశైలం ఘాట్ రోడ్ లో ఎలుగుబంటి హల్ చల్
(యువతరం నవంబర్ 28) శ్రీశైలం ప్రతినిధి:
శ్రీశైలం- దోర్నాల ఘాట్ రోడ్డుపై సోమవారం ఓ ఎలుగుబంటి హల్చల్ చేసింది. తుమ్మల బైలు జంగిల్ సఫారీ సమీపంలో ఈ ఘటన జరిగింది. రోడ్డు దాటుతున్న ఎలుగుబంటిని చూసిన భక్తులు వాహనాలు నిలిపివేశారు. ఆ సమయంలో ఎలుగుబంటి వాహనాలు ఆపిన భక్తులపై దాడి చేసేందుకు ప్రయత్నించడంతో భక్తులు గట్టిగా కేకలు వేయడంతో ఎలుగుబంటి అడవిలోకి పరిగెత్తిందిని యాత్రికులు తెలిపారు. దీంతో అక్కడున్న భక్తులు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు.