ANDHRA PRADESHPOLITICS

వైసీపీకి ఓటు వేస్తే అక్రమాలను సమర్థించినట్టే

వచ్చే ఎన్నికల్లో మార్కాపురం లో వైసీపీకి ఓటు వేస్తె వైసీపీ నాయకుల భూకబ్జాలను, అరాచకాలను, అన్యాయాలను సమర్ధించినట్టే

మార్కాపురం మాజీ శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి

(యువతరం నవంబర్ 28) మార్కాపురం ప్రతినిధి:

మార్కాపురం మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి మార్కాపురం పట్టణంలోని 13వ వార్డ్ లో “బాబు షూరిటీ- భవిష్యత్తు గ్యారెంటీ” కార్యక్రమం మంగళవారం నిర్వహించారు.
ఈ సందర్భంగా మహిళలు ముఖ్యంగా వృద్ధులు యువత భారీగా స్వాగతం పలికారు. వార్డులలో ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ వారి యోగక్షేమాలు కనుక్కున్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ భవిష్యత్తులో ప్రతి కుటుంబానికి రాబోయే తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జరిగే సంక్షేమ పథకాలను వివరించారు.
మార్కాపురంలో అధికార పార్టీ నాయకులు అధికారం చేతిలో ఉందని అడ్డగోలుగా కంటికి కనిపించిన ప్రతి స్థలాన్ని, ఇళ్లను, చివరకు శ్రీ లక్ష్మి చెన్నకేశవ స్వామి వారి భూములను కూడా వదలకుండా కబ్జా చేస్తున్నారని, అక్రమంగా ప్రజల నుండి దోచిన డబ్బు మదంతో వచ్చే ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారని వచ్చే ఎన్నికల్లో వైసిపి నాయకులు ఓటుకు వేల రూపాయలైనా ఇవ్వగలిగే అక్రమ సంపాదన సంపాదించారని వైసిపి వాళ్లు ఇచ్చే డబ్బులు తీసుకొని ఓట్లు మాత్రం తెలుగుదేశం పార్టీకి వేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
పూల సుబ్బయ్య కాలనీ పరిసర ప్రాంతాలలో మరియు మార్కాపురం పట్టణంలో ఎవరికి ఏ కష్టం వచ్చినా గతంలో ఆదుకున్నానని భవిష్యత్తులో కూడా ఆదుకుంటానని ఈ ప్రాంతంలో రోడ్లు వేసినా, మంచి నీటి సదుపాయం కల్పించినా అది తెలుగుదేశం పార్టీతోనే గతంలో సాధ్యమైందని, ఈ ప్రాంతంలో హిందువులకు స్మశాన వాటిక అవసరమని వచ్చే తెలుగుదేశం ప్రభుత్వంలో కచ్చితంగా స్మశాన వాటిక ఏర్పాటు చేస్తామని కాలనీవాసులకు మాట ఇచ్చారు.. భవిష్యత్తులో పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దుతామని ప్రజలకు మాట ఇచ్చారు.
ఎన్నికలు సమీపించే కొలది వైసిపి నాయకులు కల్లబుల్లి కబుర్లు చెప్తారని వారి మాటలు నమ్మి మరొకసారి మోసపోవద్దని మరొకసారి వైసీపీకి ఓటు వేస్తే మార్కాపురం పట్టణంలో ఎవరి స్థలాలు ఇళ్లు మిగల్చరని అభివృద్ధి కావాలంటే తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో పట్టణ తెలుగుదేశం నాయకులు, 13వ వార్డ్ తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు.

Yuvatharam News

Related Articles

Back to top button
error: Content is protected !!