ANDHRA PRADESHMOVIESSTATE NEWS

క్రైమ్ థ్రిల్లర్ మూవీ మంగళవారం

క్రైమ్ థ్రిల్లర్ మూవీ మంగళ వారం

హీరోయిన్ పాయల్ రాజ్ పుత్

త్వరలో పార్ట్ -2 షూటింగ్

దర్శకుడు అజయ్ భూపతి

(యువతరం నవంబర్ 24)
విశాఖ ప్రతినిధి:

మంగళవారం సినిమా విజయోత్సవంలో భాగంగా విశాఖలో ఆ చిత్ర యూనిట్ సభ్యులు గురు వారం సందడి చేశారు. ప్రముఖ హీరోయిన్ ఆర్ ఎక్స్ 100 ఫేమ్ పాయల్ రాజ్ పుత్ నటించిన మంగళవారం అనే సినిమా ఇటీవల విడుదలైంది. ఈ చిత్రం విజయం సాధించినందుకు గాను యూనిట్ సభ్యులు విజయోత్సవ వేడుకలలో భాగంగా విశాఖ లో గల ఓ హోటల్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ మాట్లాడుతూ, ఆర్ఎక్స్ 100 సినిమా తరువాత ఈ సినిమాకు మంచి పేరు వచ్చిందన్నారు. గ్రామీణ ప్రాంతంలో సాగే క్రైమ్ థ్రిల్లర్ మూవీగా ఈ సినిమా తెరకెక్కిందని తెలిపారు. సినిమాలో శైలజ పాత్ర పోషించేందుకు తొలుత సంకోచించినా తరువాత సాహసోపేతంగా చేశానని పేర్కొన్నారు. ఈ చిత్రాన్ని విజయవంతం చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలియచేశారు. చిత్ర దర్శకుడు అజయ్ భూపతి మాట్లాడుతూ, ఆర్ఎక్స్ 100 సినిమా తరువాత మరలా ఈ చిత్రం ఘన విజయం సాధించిందని పేర్కొన్నారు. చిత్రంలో ప్రతి సన్నివేశం ప్రక్షకులను ఆకట్టుకుంటుందని తెలిపారు. సినిమాలో ఆఖరి 40 నిమిషాలు ఎంతో ఉత్కంఠగా ఉంటుందన్నారు. ఈ చిత్రం విజయవంతం కావడానికి హీరోయిన్ పాయల్ ప్రధాన కారణం కాగా, చిత్ర కథనం కూడా కీలక పాత్ర పోషించిందని వివరించారు. మంగళవారం చిత్రం పార్ట్ 2 కూడా త్వరలోనే షూటింగ్ ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.
చిత్ర నటుడు శ్రీతేజ్ మాట్లాడుతూ, సినిమాలో ప్రతి సన్నివేశం ప్రేక్షకులకు ఆకట్టుకున్నాయని అందుకే ప్రతి ఒక్కరు చాలా ఎంజాయ్ చేస్తూ మూవీ సక్సెస్ చేశారన్నారు. ఈ సమావేశంలో చిత్రం హీరో శరవన్ రెడ్డి, నటుడు శ్రీతేజ్, హాస్యనటుడు లక్ష్మణ్, నిర్మాత సురేష్ వర్మ పాల్గొన్నారు.

Yuvatharam News

Related Articles

Back to top button
error: Content is protected !!