యువతకు ఆదర్శం గుగ్గిళ్ళ దివ్యమూర్తి

యువతకు ఆదర్శం గుగ్గిళ్ళ దివ్యమూర్తి
(యువతరం నవంబర్ 24) నేలకొండపల్లి విలేఖరి:
నేటి సమాజంలోని ప్రజలకు ఇతను ఆదర్శం అతనే గుగ్గిళ్ళ దివ్యమూర్తి అనేక పుస్తకాలు దాదాపుగా 2500 పైన పుస్తకాలు చదివిన వ్యక్తి గుగ్గిళ్ళ దివ్యమూర్తి జ్ఞాపకశక్తికి ఆయనకు సాటి లేరు. ఎవరైనా ఒక పదో లేదా ఒక 20 నో ఫోన్ నెంబర్లు గుర్తుపెట్టుకుంటారు, కానీ దివ్యమూర్తి ఏకంగా పదివేల పైన ఫోన్ నెంబర్లు గుర్తుపెట్టుకుంటాడు. అతని ఫోన్ బుక్ లో నెంబర్లు సేవ్ చేసి ఉండవు అంతటి జ్ఞాపక శక్తి కలిగిన వ్యక్తి మన దివ్యమూర్తి ఈ చిత్రంలో కనిపిస్తున్నది అతనే. ఇతనిది ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం కొత్త కొత్తూరు గ్రామం. ఇతని తల్లిదండ్రులు గుగ్గిళ్ళ ముత్తిలింగం, రమాదేవి. వ్యవసాయం చేసుకుంటారు. దివ్యమూర్తి ప్రత్యేకత ఏమిటంటే ఏ విషయాన్ని చూసినా వెంటనే గుర్తు పెట్టుకోగలడు. అది ఒక అంశమైనా, ఒక సమాచారం అయినా, ఫోన్ నెంబర్ అయినా, ఆధార్ కార్డ్ నెంబర్ అయిన ఏదైనా సరే అవలీలగా గుర్తు పెట్టుకోగలడు. ఇతను ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల పేర్లు నిమిషంలో చెప్పగలడు. మనదేశంలో ఉన్న అన్ని జిల్లాల పేర్లు నాలుగు నిమిషాల్లో చెప్పగలడు. తెలంగాణ జిల్లాల పేర్లు ఐదు సెకండ్లలో చెప్పగలడు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని జిల్లాల పేర్లు నాలుగు సెకండ్లలో చెప్పగలడు. ప్రపంచంలో ఉన్న అనేక విషయాలు చరిత్రల గురించి క్షుణ్ణంగా వివరించగలడు. తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్న ఎమ్మెల్యేల పేర్లు, ఎంపీల పేర్లు, మంత్రుల పేర్లు, కేంద్ర మంత్రుల పేర్లు, ప్రపంచ వింతలు, పరికరాలు కనిపెట్టిన శాస్త్రవేత్తల పేర్లు అనేక విషయాలు దినోత్సవాలు గురించి, విమానాశ్రయాలు గురించి, క్రికెట్ గురించి, క్రీడల గురించి, అనేక ఇతరత్రా అంశాల గురించి క్షణాల్లో చెప్పగలడు ఇతను గతంలో జరిగిన అనేక పోటీ పరీక్షల్లో జాతీయస్థాయిలో, రాష్ట్రస్థాయిలో, జిల్లా స్థాయిలో మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ఇతనికి అపర మేధావి, మేధావి జ్ఞాపకశక్తిలో దిట్ట లాంటి అనేక అవార్డులు రావడం జరిగింది. దాదాపుగా 28 అవార్డులు కైవసం చేసుకున్నాడు. అనేక మంది ప్రముఖుల చేతుల మీదుగా అవార్డులు అందుకున్నాడు. ఇతను పాటలు పాడుతాడు, మిమిక్రీ కూడా చేయగలుగుతాడు. ఇక ఎనిమిది వేల అంశాలకు పైగా చెప్పగలడు. ఆరు లక్షల పదాలు చూడకుండా చెప్పగలడు. ఇతను అనేక స్కూల్లో, కాలేజీలలో స్పీచ్ లు ఇస్తున్నాడు. నేటి విద్యార్థులు యువత ఇతనిని ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్లాలి.లక్ష్యసాధన తో ముందుకు వెళ్తున్న దివ్యమూర్తి ఆశయం నెరవేరాలని ఆశిద్దాం.